KURNOOL WILL THYROID EFFECT MEN AS MOST OF CASES REGISTERED IN WOMAN TAKE A LOOK AT DOCTORS OPINION FULL DETAILS HERE PRN KNL NJ
Thyroid: మగవారికి కూడా థైరాయిడ్ వస్తుందా..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!
ప్రతీకాత్మకచిత్రం
ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధుల్లో ఎక్కువగా ఇబ్బందిపెట్టేది థైరాయిడ్. ఈ సమస్య మహిళల్లో (Women) ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మరి మగవారికి థైరాయిడ్ రాదు అని కాదు. మగవాళ్లకు కూడా థైరాయిడ్ వస్తుంది? ఇంతకీ థైరాయిడ్ ఎందుకు వస్తుంది తెలుసుకుందాం!
ప్రస్తుత కాలంలో ప్రజలను రకరకాల వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా థైరాయిడ్ (Thyroid) సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్య మహిళల్లో (Women) ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ ఈ వ్యాధిని అంచనా వేయవచ్చు. ఇది దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి. ఒక్కసారి థైరాయిడ్ వస్తే జీవితాంతం పరగడుపున టాబ్లెట్ వేసుకోవాల్సిందే. ప్రతి ఏడాది మే 25న అంతర్జాతీయ థైరాయిడ్ డే ను జరుపుతారు. ప్రజల్లో థైరాయిడ్ అవగాహన కల్పించేందు ఆ వారమంతా థైరాయిడ్ వారంగా ప్రకటించి.., పలు ఆస్పత్రుల్లో ఉచిత థైరాయిడ్ టెస్టులు నిర్వహిస్తారు. మరికొన్ని ఆస్పత్రుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. థైరాయిడ్ వచ్చిన వాళ్లు ఏ ఆహారపదార్థులు తినాలో, తినకూడదో., రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో థైరాయిడ్పై ఉన్న అపోహలు తొలగిస్తుంటారు.
హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేథైరాయిడ్ గ్రంథి (Thyroid gland) శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన హార్మోన్లను (Hormones) ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువ, తక్కువ అయినా ఆరోగ్యంపై ప్రభావితం పడుతుంది. థైరాయిడ్ వ్యాధి ప్రతి పది మంది భారతీయులలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో సుమారు 40 మిలియన్ల మంది ప్రజలు దీనితో బాధపడుతున్నారు. థైరాయిడ్ అనేది మన మెడ ముందు భాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది మన శరీరంలోని ప్రతి కణం, కణజాలం, అవయవాన్ని ప్రభావితం చేసే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది.థైరాయిడ్ రెండు రకాలుథైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
1. హైపో థైరాయిడిజం (Hypothyroidism)2. హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism).అయితే మనం ఎక్కువగా గమనించేది హైపో థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంను తక్కువగా గమనిస్తూ ఉంటాం. థైరాయిడ్ సమస్య వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి.థైరాయిడ్ హార్మోన్లు పెరిగితే శరీర బరువు తగ్గుతుంది. దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. దీని లక్షణాలు మెడ ఉబ్బడం (Swelling of the neck) లాంటింది. దీనికి కారణం థైరాయిడ్ గ్రంథిలో వచ్చే మార్పులే.
హైపోథైరాయిడ్ లక్షణాలుథైరాయిడ్ హార్మోన్లు తగ్గితే శరీర బరువు (Body weight) పెరుగుతుంది. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడ్ శరీరంలోని ప్రతి కణానికి పై ప్రభావితం చూపుతుంది. తీవ్రమైన అలసట (Severe fatigue), బరువు తగ్గడం, జుట్టు రాలడం, అధిక చెమటలు, బలహీనంగా అనిపించడం, అధిక విరేచనాలు (Excessive diarrhea), కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే అది థైరాయిడ్ గ్రంథి సమస్యల వల్ల కావొచ్చు. తొందరగా అలసట రావటం, నిరసించి పోవటం, లైంగిక పరంగా సమస్యలు (Sex problems) వస్తుంటాయి. చర్మం పొడిగా ఉండటం, మలబద్దకం, కాళ్లు వాపు రావటం, బరువు పెరగడం, తగ్గటం నెలసరులు క్రమంగ రాకపోవటం, పిల్లలో ఎదుగుదల, మానసిక ఎదుగుదల (Mental growth) లేకపోవటం థైరాయిడ్ ముఖ్య లక్షణాలు
మహిళల్లో ఎక్కువగా థైరాయిడ్మహిళల్లో థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే నెలసరులు సరిగ్గా (Period's) సమయానికి రాకుండా క్రమం తప్పే అవకాశం ఉంది. తద్వారా గర్భం దాల్చే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి థైరాయిడ్ (Thyroid) సమస్యలకు తగిన చికిత్స చేయించుకున్నట్లైతే ఈ సమస్యలనుండి దూరంగా ఉండవచ్చు.
మహిళలకు మాత్రమే వస్తుందనేది అపోహ!అయితే ఈ వ్యాధి బాధితుల్లో స్త్రీలే ఎక్కువగా ఉంటారు.దాంతో స్త్రీలకు మాత్రమే థైరాయిడ్ వస్తుందని కొందరు అభిప్రాయ పడుతుంటారు. కానీ, అది నిజం కాదు. మగవాళ్లు కూడా థైరాయిడ్ బారిన పడుతుంటారు.
మగవారికి థైరాయిడ్ వస్తే కనిపించే లక్షణాలు ఏంటి..?
ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా, డైట్లు ఫాలో అవ్వకపోయినా బరువు తగ్గుతూ ఉంటే ఖచ్చితంగా అనుమానించాలి. ఎందుకంటే, ఉన్నట్టు ఉండి బరువు తగ్గడం అనేది థైరాయిడ్ వ్యాధి లక్షణాల్లో ఒకటి. గుండె దడ, గొంతు బొంగురు పోవడం,ఛాతీ నొప్పి వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడితే తప్పకుండా తరచూ ఇబ్బంది పడితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
థైరాయిడ్ హార్మోన్ల యొక్క అధిక ఉత్పత్తి వల్ల ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే గొంతు వాపు, మెడ భాగం గట్టిగా పట్టినట్లు ఉండటం కూడా థైరాయిడ్ వ్యాధి లక్షణాలే. ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిది.
దాంతో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.ఇలా మీకూ జరుగుతుంటే డాక్టర్ను సంప్రదించడమే ఉత్తమం.
ఇక ఇవే కాకుండా చర్మం పొడి బారడం, జుట్టురాలడం, అతి నిద్ర, నీరసం, అలసట, ఒత్తిడి, చికాకు, అధిక చెమటలు, కండరాల నొప్పి, ఆలోచనా శక్తి మందగించడం ఇవన్నీ కూడా థైరాయిడ్ లక్షణాలే. ఇటువంటి లక్షణాలను అశ్రద్ద చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.