హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Manchu-Bhuma: భూమా మౌనికతో మంచు మనోజ్ ఏడు అడుగులు..! రాజకీయ అడుగులు అటువైపేనా..? చంద్రబాబుకు మోహన్ బాబు అదే చెప్పారా?

Manchu-Bhuma: భూమా మౌనికతో మంచు మనోజ్ ఏడు అడుగులు..! రాజకీయ అడుగులు అటువైపేనా..? చంద్రబాబుకు మోహన్ బాబు అదే చెప్పారా?

మౌనికతో మంచు మనోజ్ రాజకీయ అడుగులు

మౌనికతో మంచు మనోజ్ రాజకీయ అడుగులు

Manchu-Bhuma: హీరో మంచు మనోజ్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా..? అంతకుముందే టీడీపీ నేత.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చెల్లి భూమా మౌనికతో ఏడు అడుగులు వేస్తున్నారా..? ఇటీవల చంద్రబాబు నాయుడు-మోహన్ బాబు మధ్య ఈ విషయంపై చర్చ జరిగిందా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Manchu-Bhuma: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో రెండు పెద్ద కుటుంబాలు.. ఒక్కటి కానున్నాయా.. భూమా ఫ్యామిలీ (Bhuma Family)తో మంచు కుటుంబం (Manchu Family) వియ్యం అందుకోనుందా. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఇది హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆ ప్రచారానికి ప్రధాన కారణం మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన వ్యాఖ్యలే అంటున్నారు. టాలీవుడ్ (Tollywood) సీనియర్ నటుడు.. రాజకీయంగా అనుభవం ఉన్న పెదరాయుడు మోహన్ బాబు (Mohan Babu) .. ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) లో పేరున్న రాజకీయ కుటుంబం భూమా ఫ్యామిలీతో వియ్యానికి సిద్దమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy) తో హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సీతాఫల్ మండి దగ్గర ఉన్న గణేష్ మండపంలో పూజలు నిర్వహించారు. అప్పుడే ఏదో జరుగుతోందనే ప్రచారం మొదలైంది.

  ఇలాంటి రూమర్స్ వస్తే.. అవి నిజం కాకపోతే.. వారే స్వయంగా ఖండిస్తారు.. కానీ ఈ విమర్శలపై నేరుగా మంచుమనోజ్ స్పందించారు. అన్ని విషయాలపై త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నారు. రాజకీయంగా వేసే అడుగుల పైనా స్వయంగానే తానే ప్రకటిస్తాను అన్నారు. ఆయన వ్యాఖ్యల తరువాత.. భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె.. మాజీ మంత్రి అఖిల ప్రియ సోదరి అయిన మౌనిక రెడ్డికి.. మనోజ్ కు వివాహం జరగనుందనే వార్తల ప్రచారం జోరుగా సాగుతోంది.

  భూమా మౌనికతో వివాహం గురించి అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు ఆకస్మికంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అయితే, అది రాజకీయ సమావేశం కాదని చెప్పారు. అయితే ఆ సమయంలోనే ఈ పెళ్లి ప్రస్తావన కూడా వచ్చినట్టు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం భూమా కుటుంబానికి చంద్రబాబు నాయుడే రాజకీయంగా పెద్ద దిక్కుగా ఉంటున్నారు. ఏ నిర్ణయమైనా ఆయనకు నేరుగా అఖిల ప్రియ చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు విషయం చెప్పినట్టు సమాచారం.

  ఇదీ చదవండి : పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్

  చిత్తూరు జిల్లాలో రంగంపేట శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం గురించి మాట్లాడడానికి మాత్రమే చంద్రబాబుని కలిశానని మోహన్ బాబు చెప్పారు. అయితే, ఆ భేటీ సమయంలో మంచు మనోజ్ వివాహం గురించి చర్చకు వచ్చి ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. భూమా శోభా- భూమా నాగిరెడ్డి మరణం తరువాత అఖిల ఆ కుటుంబం లో రాజకీయంగా టీడీపీ నుంచి మంత్రిగా పని చేసారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ..టీడీపీ నుంచి పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకొనేందుకు అఖిల-మౌనిక ఇద్దరూ టీడీపీ కోసం పని చేసారు.

  ఇదీ చదవండి: భక్తులకు అలర్ట్.. గురువారం నుంచి పవిత్రోత్సవాలు.. సెప్లెంబర్ లో అన్ని ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే

  తాజాగా మౌనిక తో కలిసి గణేష్ మండపం దగ్గరకు రావటం పైన స్పందించిన మంచు మనోజ్ తన వివాహం తో పాటుగా రాజకీయ ఎంట్రీ గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తానని వెల్లడించారు. మౌనిక ప్రస్తుతం రాజకీయంగా టీడీపీతో దగ్గరగా ఉంటున్నారు. కానీ, మనోజ్ బీజేపీ వైపు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తనంతటగా తాను రాజకీయ అంశాలను ప్రస్తావించటం ద్వారా..మౌనిక వివాహం ద్వారా టీడీపీలోకే ఎంట్రీ ఇస్తారనే ప్రచారం సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మనోజ్ రాజకీయంగా క్రియాశీలకంగా మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Manchu Manoj, TDP

  ఉత్తమ కథలు