హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Wife Protest for Husband: భర్త కోసం భార్య అలుపెరుగని పోరాటం.. ఎందుకో తెలుసా..?

Wife Protest for Husband: భర్త కోసం భార్య అలుపెరుగని పోరాటం.. ఎందుకో తెలుసా..?

భర్త కోసం భార్య అలుపెరుగని పోరాటం

భర్త కోసం భార్య అలుపెరుగని పోరాటం

Wife Protest for Husband: భర్త కోసం ఓ భార్య అలుపెరుగుని పోరాటం చేస్తోంది. ఒకటి రెండు కాదు వారం రోజులుగా భర్త కోసం ఆమె ఎదురు చూస్తోంది. భర్త తన దగ్గరకు వచ్చే వరకు తగ్గేదేలే అంటోంది.. అసలు ఇంతకీ ఆమె ఎందుకు ఇలా నిరసనకు దిగింది అంటే..?

ఇంకా చదవండి ...

Wife Protest for Husband: పరాయి మోజు పేరుతోనో.. వరకట్నం వేధింపుల (Dowry Harassment) పేరుతోనే భార్యలను వదిలించుకోవాలనే భర్తల సంఖ్య ఎక్కువ అవుతోంది. మరోవైపు ప్రియుడు మోజులో పడి భర్తను హత్య (Husband murder) చేస్తున్న భార్యలూ పెరుగుతున్నారు. ఇలాంటి రోజుల్లోనూ ఓ భార్య.. తన భర్త కోసం అలుపెరుగని పోరాటం చేస్తోంది (Wife protest her husband). తన భర్త కాపురానికి రానివ్వట్లేదని, తన భర్త తనకు కావాలని ఓ ఇల్లాలు కర్నూలు జిల్లా (Kurnool District) లో భర్త ఇంటి ముందు పోరాటానికి దిగింది. ఉన్నత విద్య చదివి.. సమజంలో మంచి గుర్తింపు ఉన్న తనపై పిచ్చి పట్టిందనే ముద్ర వేసి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ ఇల్లాలు వారం రోజులపాటు భర్త ఇంటి ముందే ఒంటరి పోరాటం చేస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం లొద్దిపల్లి లో బెల్లం విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvaradhan Reddy) ఇంటి ముందు ఆ భార్య.. ఒంటరిగానే వేచి చేస్తోంది. నంద్యాల జిల్లా (Nandhyala District) గడివేముల మండలం పెసరవాయికి చెందిన ఉమామహేశ్వరి (Uma Maheswari) కి 2017 లొద్దిపల్లికి చెందిన బెల్లం విష్ణువర్ధన్ రెడ్డితో వివాహమైంది. పెళ్లి సందర్భంగా 30 లక్షల రూపంలో కట్నకానుకలు ఇచ్చారు. అయినా ఇప్పుడు ఆమె తన భర్త కోసం ఇలా ఎందుకు పోరాటం చేయాల్సి వస్తోంది అంటే..?

విష్ణువర్ధన్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. కానీ పెళ్లయిన రెండు వారాలకే వీరి ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలొచ్చాయి. పుట్టింటికి వెళ్లిన ఉమామహేశ్వరిని తిరిగి భర్త ఇంటికి కాపురానికి పంపేందుకు పెద్దనుషుల ద్వారా ప్రయత్నించారు. ఒక దశలో పోలీసులు పంచాయతీ ద్వారా ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. మరో వైపు విడాకులు కావాలంటూ భర్త విష్ణువర్ధన్ రెడ్డి కోర్టు నోటీస్ ఇచ్చారు. భర్త విడాకులు తనకు వద్దంటూ భర్తే కావాలంటూ ఉమా మహేశ్వరి లొద్దిపల్లిలో భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది.

భర్త ఇంట్లోకి వెళ్లిన ఆమె.. అక్కడే 5 రోజుల పాటు స్వీయనిర్బంధంలో ఉంది. కోడలు ఇంట్లోకి రావడంతో అత్త, మామలు బెల్లం సుధాకర్ రెడ్డి, యశోధమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనినే ఉద్దేశంతో.. ఆ ఇంట్లో కరెంట్ సరఫరా కూడా నిలిపివేశారు. ఎవరో ఏదో ఒక పూట ఇంత అన్నం పెడితే తిని వారం రోజులుగా భర్త ఇంటి దగ్గరే ఆందోళనకు దిగింది. అయితే తనకు పిచ్చి పట్టిందని ప్రచారం చేసి వదిలించుకోవాలని చూస్తున్నారని.. అలాగే తాను ఇద్దరితో కాపురం చేస్తుందంటూ అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి: అహోబిలంలో భక్తుల సందడి.. ఆలయం చుట్టూ జలాల హోరు

తనకు మాత్రం.. భర్తతో కాపురం చేయాలని ఉందని.. వారి డబ్బులు , ఆస్థులు అవసరం లేదంటుంది ఉమామహేశ్వరి. అందుకే తనకు న్యాయం చేయాలని , అప్పటి వరకు నా పోరాటం ఆగదని చెబుతుంది ఉమామహేశ్వరి. అయితే ఉమా మహేశ్వరి ఆందోళనపై అత్త యశోద వాదన భిన్నంగా ఉంది. పెళ్లయిన కొత్తలోనే కాపురం చేయకుండా వెళ్ళిపోయి తమపై లేనిపోని కేసులు పెట్టిందని ఆమె ఆరోపిస్తోంది. తన కుమారుడిని కేసులతో వేధించారని, విసుగుచెంది భార్య వద్దని విడాకులు కోరుతున్నారని చెబుతోంది. ప్రతిసారి పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తున్నారని చెబుతోందామె. విష్ణువర్ధన్ రెడ్డి తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Kurnool