GT Hemanth Kumar, News18, Tirupati
క్షణిక సుఖాల కోసం చాలా మంది పండంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. హాయిగా సాగే జీవితంలో... నిప్పుల కుంపటి లాంటి వివాహేతర సంభందాలు పెట్టుకొని జీవితాన్ని సర్వ నాశనం చేసుకుంటున్నారు. నిండు నూరేళ్లు కలసి పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన జీవితం కాస్త కటకటాలపాలవుతోంది. తరచూ ప్రియునితో సరసాలు ఆడుతున్న భార్యను మందలించాడు ఓ భర్త. మరోసారి ఇలాంటి తప్పులు చేస్తే సహించేది లేదని భార్యను బెదిరించాడు. అప్పటికే ప్రియుడి మోజులో ఉన్న ఆ మహిళ.. అతడితో కలసి దారుణానికి ఒడిగట్టింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) లో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కోడుమూరులో లక్ష్మీ, సుధాకర్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
ఎంతో హాయిగా సాగుతున్న వీరి సంసార సాగరంలో అక్రమ సంబంధం అనే పెను తుఫాను సునామీని సృష్టించింది. గత కొనేళ్ళ క్రిందట లక్ష్మీకి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న దస్తగిరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య చనిపోయిన దస్తగిరి.. లక్ష్మితో ఎఫైర్ నడుపూతే.. తనకు భార్య లేని లోటు తిరుస్తున్నావని మరింత ఆప్యాయంగా మాట్లాడేవాడు.
ఐతే గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం కాస్తా ఓ రోజు భర్త సుధాకర్ కంటపడింది. దీంతో లక్ష్మీ సుధాకర్ మధ్య... విబేధాలు తారాస్థాయికి చేరాయి. భర్త బ్రతికి ఉంటే ప్రియుడితో కలిసే అవకాశం రాదని భావించి పక్క ప్లాన్ రచించింది. మద్యం మత్తులో ఉన్న సుధాకర్ ను పథకం ప్రకారం అత్యంత దారుణంగా హతమార్చి ఆపై ఊరి పొలిమేరలో ప్రియుడితో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. కుమారుడు కనిపించక పోయే సరికి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కోడలు, ఆమె ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Extramarital affairs, Kurnool, Wife kill husband