Murali Krishna, News18, Kurnool
ప్లేస్ ఎక్కడైనా.. అంశం ఏదైనా.. వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) ల మధ్య యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. తాజాగా నంద్యాల (Nandyal) మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. చైర్మన్ మాబునిస అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఇరు పార్టీ నేతలు కౌన్సిలర్లు హాజరయ్యారు. అధికార వైఎస్ఆర్సీపి (YSRCP) కౌన్సిలర్లు ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల మధ్య మాటలు యుద్ధం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పట్టణంలో ఉన్నటువంటి సమస్యలపై పురపాలక కౌన్సిల్ సమావేశంలో తెదేపా సభ్యులు ఫ్ల కార్డులు పట్టుకుని నిరసన తెలుపుతుండగా. నంద్యాల ఎమ్మెల్యే సతీమణి అయినటువంటి 36వ వార్డు కౌన్సిలర్ శిల్ప నాగిని రెడ్డి ఘాటుగా స్పందించారు.
టిడిపి నాయకులను ఉద్దేశిస్తూ మీరు గొర్రెల మొత్తుకుంటే ఊరుకునేది లేదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ సమావేశంలో పాల్గొన్న టిడిపి పార్టీ నేతలు మమ్మల్ని గొర్రెలు అంటావా అంటూ మండిపడ్డారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నంద్యాల పట్టణంలో జరిగిన సమావేశంలో సమస్యల అజెండా ముందే పెట్టడంతో ఏర్పడిన మంచినీటి సమస్యపై టిడిపి పార్టీ సభ్యులు సమస్యను తీర్చాలంటూ గళమెత్తారు.
నంద్యాల పట్టణంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తామని శాసనసభ్యులు ఇచ్చిన మాట నీటి మీద రాతలుగా మారాయి అంటూ వాటిని అమలు చేయడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారంటూ. సంక్రాంతి నాటికి పట్టణంలోని ప్రతి వార్డుకు నీటిని అందిస్తామని ఎమ్మెల్యే మాటిచ్చిన... పట్టణంలో ఇప్పటివరకు మంసనను తెలిచినీటి సమస్య తీరలేదని ఫ్ల కార్డులు పట్టుకొని నిరపారు. సమస్యలు పరష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని..ఈ సమస్యలు పూర్తిగా పక్కన పెట్టేశారని పట్టణానికి చెందినమరి కొంతమంది సభ్యులు గళమెత్తారు.
వారి ప్రశ్నలకు దీటుగా ఎమ్మెల్యే సతీమణి నాగిని రెడ్డి వారికి సమాధానం ఇచ్చే క్రమంలో నాయకులను ఉద్దేశిస్తూ. గొర్రెల మీరు మొత్తుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించడంతో పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో సభ మొత్తం గందరగోళం ఏర్పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News