Murali Krishna, News18, Kurnool
అలనా పాలనా లేని జీవాలను మేమున్నామంటూ ఆపన్న ఆస్తంతో ఆదుకుంటున్నారు వాక్ ఆర్గనైజేషన్ సభ్యులు. కర్నూలు జిల్లా (Kurnool District) లో గత రెండు సంవత్సరాలుగా వీధి కుక్కలను కాపాడుతూ.. మూగజీవాలపై తమకున్నటువంటి ప్రేమను చాటుకుంటున్నారు వాక్ ఆర్గనైజేషన్ సభ్యులు. ఎలాంటి ఆధారం లేకుండా వీధుల్లో ఏదైనా జబ్బు పడుతున్న శునకాలను తీసుకొచ్చి వాటి జబ్బు నయమయ్యేలా హాస్పిటల్లో వాటికి వైద్యం చేయించి ఆ జబ్బు నయమైనంతవరకు వారి దగ్గరే ఉంచుకొని వాటికి సఫర్యాలు చేస్తున్నారు. అంతేకాదు ఎవరైనా సరే నోరులేని ఎలాంటి జంతువులనైనా అవి ఏదైనా ప్రమాదంలో ఉన్నాయన్న సందేశం వాళ్లకు చేర వేసిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయి వాటిని సంరక్షిస్తారు. ఇందులో భాగంగా వాక్ ఆర్గనైజేషన్ నిర్వాహకుడు శివకుమార్ న్యూస్ 18 ప్రతినిధితో మాట్లాడుతూ... రోడ్డుపైవేగంగా వాహనాలు నడిపి జనం అనేక ప్రమాదాలకు గురవుగడమే కాకుండా నోరులేని జంతువులను కూడా గాయపరుస్తుంటారు.
ఇలా గాయపరిచే సమయాల్లో కొన్ని అక్కడికక్కడే ప్రాణాలను వదిలిన... మరికొన్ని తీవ్ర గాయాలతో ఎంతో ఇబ్బంది పడుతుంటాయన్నారు.అలాంటి వాటిని చూసిన ఎవరైనా తమకు సమాచారం అందించిన వెంటనే తాము ఆ ప్రాంతానికి వెళ్లి వాటిని సంరక్షిస్తుంటామని తెలిపారు. అంతేకాకుండా వాటికి వైద్యం అందించి వాటికి తగిలినటువంటి గాయాలు పూర్తిగా నయం అయ్యేవరకు తమ దగ్గరే ఉంచుకొని వాటికి పూర్తిగా నయమైన తర్వాతనే వాటిని బయటకు వదులుతామని తెలిపారు.
ఇలా వివిధ కారణాలవల్ల రోడ్డుపై వదిలేసినటువంటి శునకాలను దాదాపుగా ఇప్పటివరకు 30కి పైగానే ఇప్పటికే తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా వాటిలో కొన్నిటికి ఒక దానికి సుమారు 80 వేల రూపాయలు ఖర్చు చేసి హైదరాబాదులో ప్రత్యేకంగా వైద్యం చేయించామని తెలిపారు.ఇలా ఒకరిద్దరితో మొదలైనటువంటి వాక్ ఆర్గనైజేషన్ ఇప్పుడు సుమారు 130 మందికి పైగా సభ్యులు ఉన్నామని తెలిపారు. కానీ వీటికి ఆహారం అందించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దాతలు ఎవరైనా ఇలాంటి వాటికోసం ఆహారం అందించి ప్రోత్సహించాలని సభ్యులు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News