హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: వెళ్లిరా గణపయ్య..! సంబరాల నడుమ గణనాథుని నిమజ్జనోత్సవం..!

Kurnool: వెళ్లిరా గణపయ్య..! సంబరాల నడుమ గణనాథుని నిమజ్జనోత్సవం..!

కర్నూలులో

కర్నూలులో గణేశ్ నిమజ్జన సందడి

తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జన (Ganesh Visarjan 2022) శోభ నెలకొంది. ఇటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), అటు తెలంగాణ (Telangana) లో గణేశ్ నవరాత్రులు ముగియడంతో గణనాథుని విగ్రహాలక గంగమ్మ ఒడికి చేరుతున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnoolతెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జన (Ganesh Visarjan 2022) శోభ నెలకొంది. ఇటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), అటు తెలంగాణ (Telangana) లో గణేశ్ నవరాత్రులు ముగియడంతో గణనాథుని విగ్రహాలక గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. కర్నూలు (Kurnool) నగరంలో వినాయక శోభయాత్ర ర్యాలీ అట్టహాసంగా కొనసాగింది. నవరాత్రులు వివిధ రకాల పూజలతో ఘనంగా పూజించిన గణేషుడికి కర్నూలు వాసులు వీడ్కోలు పలికారు. వెళ్లిరా గణపయ్యా అంటూ సంబరాలు చేస్తూ సాగనంపారు. మొదటగా ఓల్డ్ టౌన్ లోని రాంబొట్ల దేవాలయం వద్ద ఉన్న వినాయకుడికి ప్రజాప్రతినిధులు ఎంపీ సంజీవ్ కుమార్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ,కాటసాని రాంభూపాల్ రెడ్డి,మేయర్ రామయ్య,మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మరియు జిల్లా అధికారులు పూజలు నిర్వహించి శోభయాత్ర ర్యాలీని ప్రారంభించారు.
  అనంతరం వినాయకుడి లడ్డు వేలంపాట నిర్వహించారు. లడ్డు కొనేందుకు అధిక సంఖ్యలో ప్రజా ప్రతినిధులు పోటీ పడగా ఒక లక్ష ఒక్క రూపాయలకు (1,00,001) బిజెపి అధికార ప్రతినిధి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి దక్కించుకున్నారు. ఈ వినాయక శోభాయాత్రలో చిన్నారులు యువకులు సందడి చేశారు. మేల తాళాలు డబ్బులతో డిజె సౌండ్ సిస్టంతో కర్నూలు నగరవీధుల్లో చిందులేసారు. నిమజ్జన ప్రాంతంలో సాంస్కృతిక నృత్యాలతో అలరించారు.

  ఇది చదవండి: చీరాల.. మళ్లీ మళ్లీ రావాల..! అక్కడ స్పెషల్ ఏంటో తెలిస్తే థ్రిల్ అవుతారు..! ఇంతకీ ఏముందంటే..!  మధ్యాహ్నం 3.15 గంటలకు వినాయక ఘాట్‌ సమీపంలోని కేసీ కెనాల్‌ వద్ద నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. మొదట కలెక్టరేట్‌ గణపతి విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. అంతకుముందు ధ్వజారోహణ అనంతరం భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన అలరించింది.

  ఇది చదవండి: సిక్స్ ప్యాక్ బాడీపై పెరుగుతున్న క్రేజ్.. కానీ అంత ఈజీ కాదంటున్న ట్రైనర్లు..!


  గతంలో కరోనా వల్ల వినాయక చవితి అంతంత మాత్రంగా జరుపుకున్నారు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జోత్సవాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. అశేష భక్తజనం నడుమ కర్నూలులో 1500కు పైగా విగ్రహాలు ఈ నిమజ్జన కార్యక్రమానికి తరలివచ్చాయి.

  ఇది చదవండి: స్వయానా గాంధీజీ ప్రారంభించిన ఆశ్రమం.. మన నెల్లూరులో ఉందని మీకు తెలుసా..?


  ఈ ఏడాది ఎంతో ఆర్భాటంగా ఈ వినాయక నిమజ్జనంను జరుపు కుంటున్నామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నిమజ్జనం ర్యాలీ లో పాల్గొoన్నారని నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని ఆయన కొనియాడారు. ఈ నిమజ్జన కార్యక్రమం కోసం ఆరు భారీ క్రేన్లు ఏర్పాటు చేసి విగ్రహాలన్నిటినీ కూడా క్రేన్ల సహాయంతోనే నిమర్జనం చేయనున్నారు.


  నిమర్జనం సందర్బంగా సుమారు 600 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు నడుమ కర్నూల్ రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఈ నిమజ్జన కార్యక్రమాన్ని అర్ధరాత్రి వరకు పర్యవేక్షించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తూ బందోబస్తు నిర్వహించారు. సంబరాల నడుమ గణనాథుని అట్టహాసంగా వీడ్కోలు పలికారు. ఇప్పుడెళ్లి.. మళ్లీ రావయ్యా అంటూ ఘనంగా సాగనంపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ganesh Chaturthi​ 2022, Kurnool, Local News

  ఉత్తమ కథలు