Home /News /andhra-pradesh /

KURNOOL VILLAGE VOLUNTEER ENTER WRONG INFORMATION ON GOVERNMENT APP AS 80 OMICRON CASES REGISTERD IN A VILLAGE IN KURNOOL DISTRICT FULL DETAILS HERE PRN TPT

AP Omicron Update: ఏపీలో ఒకేరోజు 80 ఒమిక్రాన్ కేసులు.. పరుగులు పెట్టిన అధికారులు.. అసలు విషయం ఏంటంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రేదేశ్ (Andhra Pradesh) లో ఈ సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమైన ప్రజల్లో టెన్షన్ నెలకొంది. ఐతే ఒకే గ్రామంలో 80 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయన్న వార్తలు కలకలం రేపాయి.

ఇంకా చదవండి ...
    GT Hemanth Kumar, Tirupathi, News18

    కరోనా ఓమిక్రాన్ వేరియంట్ (Corona Omicron Variant) ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ (Lockdown) దిశగా అడుగులు వేస్తుంటే ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షలు విధిస్తూ పలు దేశాలకు విమాన రాకపోకలు నిలిపివేశారు. కరోనా జన్యుపరమైన మార్పులతో రూపాంతరం చెంది... డెల్టా, డెల్టా ప్లస్, ఇప్పుడు ఒమిక్రాన్, రాబోవు రోజుల్లో డెల్మిక్రాన్ గా రూపాంతరం చెందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈ సంఖ్య సింగల్ డిజిట్ లో ఉండటం సంతోషదాయకమే అయినా రాబోవు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం ఇప్పట్లో అంచనా వేయడం కష్టంగా మారుతోంది.

    ఏపీలోని ఓ జిల్లాలో గ్రామ వాలంటీర్ చేసిన పొరబాటుకు జనమంతా పరుగులు పెట్టాల్సి వచ్చింది. అధికారులైతే బెంబేలెత్తిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఫీవర్ సర్వేలో భారంగా కర్నూలు జిల్లాలో అధికారులు ఇంటిటికీ సర్వే చేస్తున్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, అశావర్కర్లు ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌతాళం మండలం తోవి గ్రామంలో 80 మందికి ఓమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారిక యాప్ లో వివరాలు అప్ లోడ్ అయ్యాయి. వెనువెంటనే ఆరోగ్య శాఖా వెబ్ సైట్ లో తోవి గ్రామంలో 80 మందికి ఓమైక్రాన్ ఉన్నట్లు గణాంకాలు ప్రత్యక్షమైయ్యాయి.

    ఇది చదవండి: కరోనా టైమ్ లో కన్నింగ్ ఐడియా.. ఏకంగా రూ.200 కోట్లకు టోకరా.. ఏలా చేశారంటే..!


    దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా నుంచి జిల్లాఅధికారులకు భారీ ఎత్తున ఫోన్స్ రావడంతో పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఆ గ్రామాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చి గ్రామంలోకి ఇతరులు ప్రవేశించేందుకు వీలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు వచ్చాయి. జిల్లా అధికారుల నుంచి మండల స్థాయి అధికారులకు వెనువెంటనే ఫోన్లు చేసి పరిస్థితిపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. గ్రామం వద్ద చేరుకున్న మండలాధికారులు వివరాలు నమోదు చేసిన వాలంటీర్ అయిన రామాంజనేయులను ప్రశ్నించారు. ఎం జరిగిందంటూ అరా తీయడం మొదలెట్టారు.

    ఇది చదవండి: కొత్త దారిలో వైసీపీ నేతలు.. మేకప్ వేస్తే లక్ కలిసొస్తుందా..?


    చివరికి అధికారులకు షాకింగ్ నిజం తెలిసింది. గ్రామంలో ఎవరికీ ఎలాంటి లక్షణాలు లేకున్నాసమాచారాన్ని తప్పుగా నమోదు చేసినట్లు విచారణలో రుజువైంది. కానీ సదరు వాలంటీర్ రామాంజనేయులు మాత్రం అందరి దగ్గర వివరాలు తీసుకొని.., ఎవరికీ ఎలాంటి సమస్య లేదనే అంశాలను కరెక్ట్ గానే ఎంటర్ చేశానని.., సర్వర్ సమస్య వల్లే తప్పుగా సమాచారం చూపిస్తుంది అని వాలంటీర్ అన్నాడు. దీంతో ఉన్నతధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

    మీ నగరం నుండి (కర్నూలు)

    ఆంధ్రప్రదేశ్
    కర్నూలు
    ఆంధ్రప్రదేశ్
    కర్నూలు
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kurnool, Omicron corona variant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు