Home /News /andhra-pradesh /

Snake Bite: పాములు పట్టడంలో ఎక్స్ పర్ట్.. కానీ చిన్న నిర్లక్ష్యం అతడి ప్రాణం తీసింది..

Snake Bite: పాములు పట్టడంలో ఎక్స్ పర్ట్.. కానీ చిన్న నిర్లక్ష్యం అతడి ప్రాణం తీసింది..

పామును పట్టుకుంటున్న రంగస్వామి (ఎడమవైపు)

పామును పట్టుకుంటున్న రంగస్వామి (ఎడమవైపు)

పాములు పట్టడంలో అతడికి ఏంతో నేర్పుంది. ఎన్నో పాములను పట్టి అడవిలో వదిలేశాడు. కానీ చిన్నపొరబాటు అతడి ప్రాణాలమీదకు తెచ్చింది.

    GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

    పాములు చూస్తేనే గుండెలో వణుకుపుట్టి ఆమడ దూరం పరుగులు తీస్తాం. ఇంటి ఆవరణలో విషసర్పాలు కనిపిస్తే అంతే సంగతులు రాత్రుల్లో నిద్ర కూడా పట్టదు. నిద్రపోతున్న వేల పాము మన కళలోకి వచ్చి మరి మనల్ని తీవ్ర కలవరానికి గురి చేస్తాయి. ఇల్లు, వీధుల్లో ప్రత్యక్షం అయ్యే పాములను పట్టుకునేందుకు నైపుణ్యంగా కలిగిన స్నేక్ క్యాచర్స్ ఉంటారు. పాములు విషపూరితం కావడంతో వాటిని పట్టేందుకు ప్రత్యేక పరికరాలు వారి వెంట తెచ్చుకుంటారు. గ్లౌ, పట్టకర్ర, పామును ఒక చోట నుంచి అటవీ ప్రాంతంలో వదిలేందుకు వినియోగించే స్నేక్ బ్యాగ్ లను ఎపుడు తమ వద్ద ఉంచుకుంటారు. పామును పెట్టె సమయంలో చాల జాగ్రత్తలు తీసుకుని వాటిని సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో విడిచి పెడుతారు. కానీ పల్లెలో ఇవేమి ఉండవు. స్థానికంగా ఉండే వారిలో ఎవరో ఒకరు పామును దైర్యంగా పెట్టేస్తుంటారు. వారికి ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టేస్తారు. అయితే పామును నిర్బంధించే క్రమంలో పల్లెలోని స్నేక్ క్యాచర్స్ తమ ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

    కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని మాలపల్లెలో నివాసం ఉంటున్నాడు రంగస్వామి. తన జీవనాధారం కూలీ అయినప్పటికీ ఊరిలో ఎక్కడ పాములు కనపించినా... అతనికే మొదట పిలుపు వస్తుంది. ఎలాంటి పరికరం అవసరం లేకుండా సునాయాసంగా పామును పట్టుకొని అటవీప్రాంతంలో విడిచేవాడు. పెద్ద పెద్ద సర్పాలను సైతం ఎలాంటి బెరుకు లేకుండా ఒంటి చేత్తో చాకచక్యంగా పట్టుకొనే వాడు. దీంతో ఆ ఊరిలో పెద్ద స్నేక్ క్యాచర్ ఎవరంటే రంగస్వామి పేరే వినిపించేది. శుక్రవారం నాడు మలపల్లెలో ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద విషసర్పం ఒకటి ప్రత్యక్షమైంది. దీంతో అక్కడ ఆడుకుంటున్న విద్యార్థులు స్థానికులు రంగస్వామికి సమాచారాన్ని అందించారు.

    వెంటనే అక్కడకు వచ్చిన అయన పామును పెట్టే ప్రయత్నం చేసాడు. అయితే పామును పెట్టుకోకుండా చంపే ప్రయత్నం చేశాడు రంగస్వామి. కర్రతో పాము తలపై బలంగా రెండు సార్లు మోదాడు. దీంతో ఆ పాము చలనం లేకుండా పడిపోవడంతో చేతితో పట్టుకొని చనిపోయిందా పరిశీలించాడు. దీంతో ఒక్కసారిగా తేరుకున్న పాము రంగస్వామిని కాటేసింది. స్థానికులు అతడ్ని హుటాహుటిన ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే రంగస్వామి మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఎంతో నైపుణ్యంతో పాములు పట్టి చాలా మంది ప్రాణాలు కాపాడిన రంగస్వామి అదే పాముకాటుకు బలవడంతో గ్రామస్తులు విషాదంతో మునిగిపోయారు.

    మీ నగరం నుండి (కర్నూలు)

    ఆంధ్రప్రదేశ్
    కర్నూలు
    ఆంధ్రప్రదేశ్
    కర్నూలు
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Kurnool, Snake bite

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు