Home /News /andhra-pradesh /

KURNOOL VERY FAMOUS AND OLDEST TEMPLE IN KURNOOL DISTRICT DID YOU KNOW TEMPLE SPECIALTY NGS KNL NJ

Lord Shiva Temple: నిమ్మచెట్టునే శివలింగంగా ప్రతిష్టించిన ధర్మరాజు! ఈ ఆలయం ఎక్కడ ఉంది..? ప్రత్యేకత ఏంటో తెలుసా?

నిమ్మ చెట్టునే లింగంగా ప్రతిష్ట చేసిన ఆలయం

నిమ్మ చెట్టునే లింగంగా ప్రతిష్ట చేసిన ఆలయం

Lord Shiva Temple: మన దేశంలో ఎన్నో ప్రముఖ ఆలయాలను ఉన్నాయి. వాటి చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. అలాంటివాటిలో చాలా అరుదైన ఆలయాలను ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్నాయి. అయితే భీముడు రాని కారణంగా.. నిమ్మ చెట్టునే శివలింగంగా మార్చి.. ధర్మరాజు ప్రతిష్ట చేసిన ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..?

ఇంకా చదవండి ...
  Murali Krishna, News18, Kurnool

  Jagannadha Gattu Temple: భారత దేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు (Famous Temples) .. పురాతన ఆలయాలు (Old Temples) ఉన్నాయి. కొన్ని బాగా ప్రసిద్ధి చెందాయి.. కొన్నింటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా.. రావాల్సిన గుర్తింపు దక్కనివి కూడా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నో పూరాతన ఆలయాలు  ఉన్నాయి. అయితే వాటి ప్రత్యేకతలు ఇప్పటికే చాలామందికి తెలియదు.. అలాంటి వాటిలో ఒకటి..  జగన్నాథగట్టు ఆలయం (Jagannadha Gattu Temple).. ఈ ఆలయం  నిర్మాణం వెనుక చాలా పెద్ద కథే ఉంది అంటారు పూర్వీకులు. శివునికి (Lord Shiva) ప్రసిద్ది చెందిన ఈ ఆలయం కర్నూలు (Kurnool) లోని బి.తాండ్రపాడు లో ఉంది. పట్టణం నుండి నంద్యాల వెళ్ళే మార్గంలో జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (G Pullareddy Engineering College) దాటగనే ఈ కొండకు దారి ఉంది. ఈ ఆలయంలోని లింగానికి ఉన్న చరిత్రవల్ల ఈ ప్రాంతం ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవ రాజైన భీముడు తీసుకువచ్చాడని పురాణాల కథనం. ఈ శివలింగం ఎత్తు 6 అడుగులు, వెడల్పు 2 అడుగులు.

  ఈ ఆలయానికి 1100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. సంగమేశ్వరాలయాలలోని రూపాల సంగమేశ్వరాలయం ఇక్కడికి తరలించడంతో, ఈ కొండ ప్రాధాన్యత సంతరించుకొంది. పూర్వం పాండవులు శ్రీశైలం వెళ్లే మార్గంలో సప్త నదుల సంగమం అని పిలువబడే సంగమేశ్వరంలో ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్టించాలనుకుని.. శివలింగాన్ని తీసుకురమ్మని భీముడిని కాశీకి పంపుతాడు. కానీ, విగ్రహ ప్రతిష్టాపన ముహుర్త సమయానికి బీముడు రాకపోవడంతో. నిమ్మ చెట్టుతో ఒక శివలింగ ఆకృతిని చేసి ప్రతిష్టించాడని చరిత్ర పురాణాలు చెబతున్నాయి. తరువాత బీముడు కాశీనుంచి శివ లింగాన్ని తీసుకురాగానే దానిని కూడా ప్రతిష్టించారు.

  ఇదీ చదవండి : జగన్ మరో రికార్డు.. దేశంలో మరోసారి నెంబర్ వన్ సీఎంగా గుర్తింపు.. ఎందులోనో తెలుసా..?

  శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మించడంతో సంగమేశ్వరం ఆలయం నీట మునుగుతుండటంతో అక్కడి నుంచి కర్నూలు సమీపంలో కొండపై ఆలయం నిర్మించడంతో ఆ కొండ ప్రాధాన్యత సంతరించుకుంది అప్పటి నుంచి ఆ ప్రాంతానికి జగన్నాధ గట్టు అనే పేరు వచ్చిందని ప్రతితి.

  ఇదీ చదవండి : గడప గడపకు బ్రేక్.. ఇక మంత్రుల బస్సు యాత్ర.. ఎప్పటినుంచి అంటే?

  ఆలయా విశేషాలు
  ఆలయం లోపల నటరాజ మూర్తులు ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు కొలువుదీరాయి. అదేవిదంగా ఆలయా గోపురానికి ఇరువైపులా చక్కటి శిల్పా కలలు అందరిని ఆకట్టుకుంటాయి. ఈ గుడికి వెళ్లేదారిలో బసవేశ్వరుడు , గుడి ఆవరణలో ఆదిశేషుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయంలో ప్రవేశించిగానే చుట్టూ చెట్లు పచ్చదనంతో ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అలా వచ్చిన భక్తులు కూర్చోడానికి బెంచీలు కూడా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.

  ఇదీ చదవండి : అయ్యో పాపం.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. ముప్పై ఏళ్లుగా నడిరోడ్డు మీదే జీవనం..! ఎందుకంత కష్టం?

  శివరాత్రి, కార్తీకమాసంలో ప్రత్యేకపూజలు
  ప్రతి నిత్యం విశేషామైన పూజలు నిర్వహించబడతాయి.ముక్యంగా శివరాత్రి, కార్తీకమాసం, శ్రావణమాసంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

  ఇదీ చదవండి : 6 ఏళ్లకే పోలియో.. ఇప్పుడు రూ. 25కోట్ల టర్నోవర్‌ బిజినెస్‌..! ఎలా సాధ్యమైందంటే?

  జగన్నాథ గట్టు ఆలయం చూడదగ్గ మరో ప్రదేశం
  దీని సమీపంలోనే అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆలయం వెనక భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడి నుంచి చుస్తే కర్నూలు సిటీ మొత్తం కనిపిస్తుంది. అంతేకాదు హైదరాబాద్‌- బెంగళూరు నేషనల్‌ హైవే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయం నుండి ఆంజనేయ స్వామి విగ్రహానికి వెళ్ళే దారిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ (IIITDM) ఉంది.

  ఇదీ చదవండి : పరశురాముడు ప్రతిష్టించిన శివలింగం.. ప్రత్యేకత ఏంటి.. ఎక్కడుందో తెలుసా?

  ఆలయానికి ఎలా చేరుకోవాలి?                                                                        కర్నూలు నుంచి ఈ ఆలయానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం కలదు. కర్నూలు,నంద్యాల రైల్వేస్టేషన్‌లు ఈ ఆలయానికి దగ్గరగా ఉంటాయి. ఆ రైల్వేస్టేషన్‌ల దగ్గర దిగి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Hindu Temples, Kurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు