Murali Krishna, News18, Kurnool
ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) ఆత్మకూరు పట్టణం కొత్తపల్లి మండలం సమీపంలో గల శివరాంపురం గ్రామంలోని నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన కొలను భారతీ క్షేత్రానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. దట్టమైన అడవి ప్రాంతంలో ఎత్తైన కొండల నడుమ చారు బోసిని నది ఒడ్డున కొలువైన కొలను భారతి ఆలయం రాష్ట్రంలో ఇదే ఏకైక సరస్వతీ క్షేత్రంగా వెలసింది. ఆధ్యాత్మిక విశిష్టత చరిత్రను బట్టి బాసర కన్నా ఇదే పురాతన దేవాలయంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ క్షేత్రంలో అమ్మవారు పుస్తకదారినీరూపంలో దర్శనమిస్తోంది. అమ్మవారి మూలవిరాట్ ఎదురుగా శ్రీ చక్రం ఉంటుంది నాలుగు చేతులు కలిగిన దేవి ఉత్తర ముఖంగా దర్శనం ఇస్తున్నారు.
11వ శతాబ్దానికి చెందిన మల్లు భూపతి అనే చాళుక్య రాజు ఆలయం నిర్మించినట్లు శిలా శాసనాలు బట్టి తెలుస్తుందని ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు తెలుపుతున్నారు. ఈ కొలను భారతి అమ్మవారిని జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. వసంత పంచమి రోజున కొలనుభారతిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో వసంతపంచమి సందర్భంగా కొలను మారుతీ క్షేత్రంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడానికి శ్రీశైలం ఈవో లవన్న పట్టు వస్త్రాలు పళ్ళు పూలు ప్రత్యేకంగా తీసుకువచ్చి అమ్మవారికి అలంకరణ చేయించి ప్రత్యేక పూజలు చేశారు.
పూజలు అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం భాగ్యం కలిగించారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎందుకుగాను శివపురంచెంచుగూడెం నుంచి ఆలయానికి చేరుకునేందుకు భక్తులకుఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేశారు.
క్షేత్రానికి వెళ్ళవలసిన వివరాలు
కర్నూలు నుంచి 70కిలోమీటర్లు దూరంలో ఆత్మకూరు ఉంటుంది అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొత్తపల్లె మండలానికి చేరుకొని. అక్కడి నుంచి శివపురం గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News