Home /News /andhra-pradesh /

KURNOOL UNIQUE TRADITION IN KURNOOL DISTRICT OF ANDHRA PRADESH AS DEVOTEES OFFERING SCORPIONS TO GOD FULL DETAILS HERE PRN KNL NJ

Kurnool: మనం తేళ్లను చూస్తే పారిపోతాం.. కాని వారికి మాత్రం అవి దైవంతో సమానం.. ఏపీలో విచిత్ర ఆచారం..

కొండలరాయుడు

కొండలరాయుడు ఆలయంలో స్వామికి తేళ్ల నైవేద్యం

మన దేశంలో కొన్ని ఆచారాలు, పద్ధతులు చాలా వింతగా ఉంటాయి. కొన్ని పూజలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి ఓ వింత ఆచారం.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉంది. కర్నూలు జిల్లా (Kurnool District) కోడుమూరు మండలంలో కొండల రాయుడుగా వెలసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే నైవేద్యం వింతగా ఉంటుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India
  Murali Krishna, News18, Kurnool

  మన దేశంలో కొన్ని ఆచారాలు, పద్ధతులు చాలా వింతగా ఉంటాయి. కొన్ని పూజలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి ఓ వింత ఆచారం.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉంది. కర్నూలు జిల్లా (Kurnool District) కోడుమూరు మండలంలో కొండల రాయుడుగా వెలసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే నైవేద్యం వింతగా ఉంటుంది. అక్కడ స్వామివారికి తేళ్లను నైవేద్యంగా పెడతారు. పాము,తేళ్లవంటి విషపురుగులను చూడగానే జనం భయంతో ఆమడదూరం పారిపోయే సంఘటనలను తరచూ మనం చూస్తూనే ఉంటాం . అయితే అదే విషపురుగును (తేళ్లను) ఎలాంటి జంకు బంకు లేకుండా చేతులతో పట్టుకొని భగవంతునికి కానుకలుగా సమర్పించి పూజలు చేయడం ఆచారంగా పెట్టుకున్నారు కర్నూలు జిల్లా కోడుమూరు వాసులు. శ్రావణమాసం మూడో సోమవారం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా ప్రజలు చుట్టుపక్కల జిల్లాల వాళ్లు అందరూ కోడుమూరు పట్టణంలోని కొండ్రాయి కొండకు క్యూ కడతారు. ఆ కొండపై వెలసిన కొండల రాయుడిని దర్శించుకుంటారు. అంతేకాదు ఆ కొండమీద ఏ రాయిని కదిపినా దాని కింద తేళ్లు ఉంటాయి. వాటిని తీసుకెళ్లి…ఆ కొండల రాయుడికి కానుకగా సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

  చాలా ఎత్తుపై వెలసిన స్వామి సన్నిధికి చేరుకోవడానికి కష్టతరమైనప్పటికీ భక్తి పరవశంతో కొండపైకి ఎక్కి… భక్తులు స్వామి సన్నిధిలో పూజలు చేయడం ఒక విషయమైతే… తేళ్లను స్వామివారికి కానుకలుగా సమర్పించి పూజలు చేయడం ఇక్కడ మరింత ప్రత్యేకం.

  ఇది చదవండి: చూడటానికి ఇది పార్క్ మాత్రమే.. కానీ లోపలికెళ్తే ప్రపంచాన్నే మర్చిపోతారు..!


  కొండపై ఏ రాయిని కదిపినా…!
  తేళ్లను నైవేద్యంగా సమర్పించి భక్తులు తమ మొక్కబడులు చెల్లించడం ఇక్కడ ఆనాదిగా వస్తుంది. భక్తులు కొండపై కలియ తిరుగుతూ తేళ్ల కోసం కొండపైనున్న రాళ్లను తొలగించి వాటి కింద ఉన్న తేళ్లను చేతులతో పట్టుకొని గర్భగుడిలోని మూల విరాట్ పై వదులుతారు. ఇలా తేళ్ల ను మూలవిరాట్ పై వదిలిన తర్వాతే భక్తులు స్వామివారికి పూజలు చేస్తారు. అయితే తేళ్లను పట్టుకునే సందర్భంలో అవి కుడితే ఏంటని ప్రశ్నిస్తే…తమకేమీ కాదంటూ కూడా భక్తులు చాలా విశ్వాసంగా చెబుతున్నారు. ఒకవేళ తేలు కుట్టిన గర్భగుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షణలు చేస్తే ఏ బాధ, నొప్పి ఉండదని భక్తులు చెబుతున్నారు.

  ఇది చదవండి: అక్కడ దొరకని పుస్తకమంటూ ఉండదు.. నాలెడ్జ్ కు కేరాఫ్ అడ్రస్ ఆ లైబ్రరీ.. ఏపీలో ఎక్కడుందంటే..!


  వాస్తవానికి విషపురుగులైన తేలు కుట్టినట్లయితే ఆ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. దీనికి వైద్యుల దగ్గర తగిన వైద్యం తీసుకోకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా కోల్పోవాల్సి ఉంటుంది. అలాంటిది ఇక్కడి భక్తులు చేతులతోనే తేలులను పట్టుకొని స్వామివారికి కానుకలుగా సమర్పిస్తూ అబ్బుర పరుస్తున్నారు.

  ఇది చదవండి: చూడ్డానికి పాత ఆటోలా కనిపిస్తుందా..! కానీ లోపల చూస్తే వారెవ్వా అనాల్సిందే..!


  ఈ పూజా కార్యక్రమాలు విశేషంగా ప్రాచుర్యం పొందడంతో ఒక్క కొడుమూరు వాసులేకాదు., జిల్లా వాసులు, ఇతర జిల్లాల ప్రజలు ఇక్కడికి తరలివస్తూ ఈ వింత ఆచారాన్ని తిలకిస్తున్నారు. కొండపై దొరికే తేళ్లను ఆ కొండరాయుడు ఇష్టపడతారని భక్తులు నమ్ముతారు. అందుకే భక్తితో కొండపై ఏ చిన్న రాయిని కదిపినా తేళ్లు కనిపిస్తాయంటారు. గత 50 ఏళ్లకు పైగా ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా శ్రావణ మాసం మూడో సోమవారం కాలి నడకన కొండపైకి ఎక్కిన భక్తులు.. ఎంతో వైభవంగా తేళ్ల పండుగను జరుపుకున్నారు.

  టైమింగ్స్‌ : ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొండపై ఆలయం తెరిచి ఉంటుంది.
  అడ్రస్‌: కొండ్రాయి కొండ, కోడమూరు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 518464

  Sri Kondarayuni Temple Kurnool District

  ఎలా వెళ్లాలి.?
  కర్నూలు నుంచి 35కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడుమూరుకు బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఎమ్మిగనూరు రోడ్ వైపు వెళ్లే బస్సు ఎక్కితే కొండ్రాయి కొండ ప్రాంతంలో దించుతారు. అక్కడ నుంచి కొండపైకి స్వయంగా మనమే ఎక్కాల్సి ఉంటుంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు