Murali Krishna, News18, Kurnool
ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) లో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కొలువై ఉన్న మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) లో ఉగాది బ్రహ్మోత్సవాలు (Ugadi) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలను చేస్తున్నారు ఆలయ అర్చకులు ప్రతిరోజు వేదమంత్రోత్సల నడుమ స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో అలంకరించి విశేష పూజలను నిర్వహిస్తున్నారు వేద పండితులు. ముఖ్యంగా ఈ ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా కర్ణాటక మహారాష్ట్ర రెండు ప్రాంతాల నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అలా రెండు ప్రాంతాల నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లకు వాటితో అలంకరించి ఈ ఉగాది బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు.
ఇందులో భాగంగానేఉగాది మహోత్సవాలు మూడోవ రోజు కన్నులపండువగా సాగుతున్నాయి ఉత్సవాల మూడోవ రోజులో భాగంగా నేడు మహాసరస్వతి అలంకార రూపంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక వేదికపై మహాసరస్వతి అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి నందివాహనాదీసులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చకులు వేదపండితులు ఈవో ఎస్.లవన్న దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు.
అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు భాజా భజంత్రిలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ డప్పు చప్పుల్లు, కోలాటాలు ఆటపాటల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో విహరించారు ఆలయ ఉత్సవం ముందు భక్తులు బక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో అబ్బురపరిచే విన్యాసాలతో డోలు చప్పులతో వివిధ కళా ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు.
అనంతరం లక్షలాది కన్నడ భక్తుల నడుమ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను గ్రామోత్సవం నిర్వహించారు వేలాదిమంది కన్నడ భక్తులు శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకొని పునితులైనారు ఈ పూజ వాహనసేవ కార్యక్రమలలో ఈవో లవన్న దంపతులు ,అధికారులు పెద్దఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Srisailam Temple