(T. Murali Krishna, News18, Kurnool)
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో దారుణం చోటు చేసుకుంది. డబ్బుల పంచాయతీ విషయంమై పోలీసులను సంప్రదించగా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శంకర్ నాయక్ దుర్భాషలాడి అవమానించడంతో తల్లి, కొడుకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుమారుడు దస్తగిరి మృతిచెందగా... తల్లి గురమ్మ పరిస్థితి విషమంగా ఉంది.
బనగానపల్లె మండలం చిన్న రాజుపాలెం గ్రామానికి చెందిన తల్లి కొడుకును పోలీస్ స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ తీవ్రంగా మందలించాడు. దీంతో తల్లి, కొడుకు ఇద్దరూ రాత్రి తొమ్మిది గంటలకు పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు.అదే గ్రామానికి చెందిన వడ్డే నాగ లచ్చమ్మ ఫిర్యాదు చేసిందని స్టేషన్ కు పిలిపించి తన తల్లి గుర్రమ్మనుబూతులతో చీర విప్పి కొడతానని నోటికి వచ్చిన మాటలతో తిట్టడంతో అవమానం భరించలేక తల్లి, కుమారుడు బనగానపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అది గమనించిన స్థానికులు వెంటనే ఇద్దరినిస్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కుమారుడు దస్తగిరి ప్రాణాలు కోల్పోయాడు.తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో. బాధితుల యొక్క బంధువులు వెంటనే పోలీస్ స్టేషన్ ఎదురుగా మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు .ఈ విషయం తెలుసుకున్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు.
బాధితుడి మృతికి కారణమైన ఎస్ఐ శంకర్ నాయక్ ను వెంటనే స్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై శంకర్ నాయక్ సస్పెండ్ చేసేంతవరకు మృతదేహాన్ని ఇక్కడే పోలిస్టేషన్ ఎదుటే రోడ్డు ఉంచుతామని బైఠాయించారు.బాధితులకు న్యాయం చేయకపోతే. ఈ విషయంపై జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిమరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News