బాబోయ్ కరోనా అని భయపడాల్సి వస్తోంది. ముఖ్యంగా కుటుంబాలపై కరోనా పగబట్టినట్టు కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే చాలా కుటుంబాల్లో విషాదం నెలకొంది. చాలా జిల్లాల్లో వైరస్ దెబ్బకు కుటుంబాలకు కుటుంబాలు బలవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లెక్కలోకి వచ్చినవి కొన్నైతే.. ఇంకా లెక్కలోనికి రాని మరణాలు ఎన్నో తెలియడం లేదు. కానీ గతంతో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ చాలా భయంకరంగా కనిపిస్తోంది.
కృష్ణాజిల్లా నూజివీ డు పట్టణంలో తండ్రీకూతురు కరోనా కాటుకు బలవగా.. కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనాకు చికిత్స పొందుతూ భార్య, భర్త గంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. కర్నూలు జిల్లాలో వైరస్ బారిన పడడంతో ఒకేరోజు తల్లీకొడుకుని బలితీసుకుంది. కృష్ణాజిల్లా నూజివీడులో రాంబాబు అనే వ్యాపారి కుటుంబంలో కరోనా మహమ్మారి ఊహించని విషాదం నింపింది. వారిద్దరికీ కరోనా సోకిన విషయం తెలియక ముందే రాంబాబు కుమార్తె డెలివరీకి పుట్టింటింకి వచ్చింది. కానీ కొద్ది రోజుల తర్వాత ఈ ముగ్గురికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే ముగ్గురూ చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాంబాబు మృతి చెందారు. ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చిన కుమార్తె కరోనాకు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆమెకు పుట్టిన శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రాంబాబు కుమారుడు కూడా ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్లైవుడ్ వ్యాపారి 48 ఏళ్ల విజయ శ్రీనివాస్, భార్య 43 ఏళ్ల విజయలక్ష్మికి కరోనా సోకడంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుమార్తెకు కూడా కరోనా లక్షణాలు ఉండటంతో ఆమె ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉంది. అయితే కరోనాకు చికిత్స తీసుకుంటూనే భార్యభర్తలిద్దరూ గంటల వ్యవధిలో మృతి చెందారు.
ఇక ఇటీవల ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందిన ఘటన విజయవాడలో కలకలం రేపింది. పాతబస్తీకి చెందిన లాయర్ 37 ఏళ్ల దినేష్ కరోనా బారినపడి మొదట మృతి చెందగా.. మరుచటి రోజే దినేష్ తండ్రి కన్నుమూశారు.. ఇక, రెండు రోజుల గ్యాప్ తరువాత దినేష్ తల్లి, బాబాయ్ కూడా మృతిచెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
అయినా లెక్కలోనికి రాని కేసులు చాలానే ఉన్నాయి. అధికారికంగా మరణించిన వాళ్ల జాబితా చూస్తే కుటుంబాలపై భారీగానే కరోనా కాటు కనిపిస్తోంది. కరోనా వైరస్ తొలి దశలో కుటుంబ నుంచి ఒకరు మరణిస్తే.. మిగితా వారంతా జాగ్రత్తలు పాటిస్తూ కరోనాకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు దాదాపు చాలా వరకు కుటుంబాల మొత్తం పై ప్రభావం చూపిస్తోంది. గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందడం తీవ్ర ఆందోళన పెంచుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Corona dead boides, Corona positive, Corona second wave, Kadapa, Ongole, Vijayawada