హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తుపాకుల గూడెం.. కేరాఫ్ కర్నూల్..!

తుపాకుల గూడెం.. కేరాఫ్ కర్నూల్..!

X
కర్నూలులో

కర్నూలులో తుపాకుల గూడెం మూవీ యూనిట్ సందడి

యువతలో పట్టుదల నైపుణ్యం ఉంటే ఎంతటి పనినైనా తేలికగా చేయవచ్చని అనుకుంది సాధించవచ్చు అని తుపాకులగూడెం సినిమా హీరో ప్రవీణ్ ఖండేలా తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూల్ (Kurnool) నగరానికి వచ్చిన సినిమా బృందం సందడి చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

యువతలో పట్టుదల నైపుణ్యం ఉంటే ఎంతటి పనినైనా తేలికగా చేయవచ్చని అనుకుంది సాధించవచ్చు అని తుపాకులగూడెం సినిమా హీరో ప్రవీణ్ ఖండేలా తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూల్ (Kurnool) నగరానికి వచ్చిన సినిమా బృందం సందడి చేసింది. తుపాకుల గూడెం సినిమా హీరో ప్రవీణ్ కండెల మాట్లాడుతూ తనది కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం ఎర్రగుడి పక్కన కొత్తపల్లి గ్రామం అని.., చదువు రీత్యా హైదరాబాద్ (Hyderabad) నగరానికి వెళ్లి స్థిరపడాల్సి వచ్చిందని తెలిపారు. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో 40 మంది కొత్త నటీనటులతో కలసి ఈ సినిమా నిర్మాణం చేపట్టామని తెలిపారు.

వారధి క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో జయదీప్ విష్ణు ఈ తుపాకుల గూడెం సినిమాకి దర్శకత్వం వహించారని తెలిపారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మనీ శర్మ, సంగీతం అలాగే రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఒక పాటను పాడారని తెలిపారు. సినిమాను సుమారు 40 మంది కొత్త నటుల తోనే నిర్మించామన్నారు ప్రధానంగా ఈ సినిమా ఉద్యోగాల పేరుతో మోసపోతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా తీసినట్లు తెలిపారు. ప్రధానంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఒక పెద్ద స్కాం నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో స్కామ్ జరిగిందని ఆ సంఘటనను తీసుకొని అందులోని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒకవైపు ఫారెస్ట్లో కలపను అక్రమంగా తరలించడం మరోవైపు నక్సలిజం అలాగే ఈ మధ్యలో చిన్నపాటి ప్రేమ వ్యవహారం కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలిపారు.

ఇది చదవండి: బెజవాడ నడిబొడ్డున అద్భుతం.. వందల ఏళ్ల చరిత్ర వాటి సొంతం

కలప అక్రమ వ్యాపారం చేసే రాజన్న దగ్గర తుపాకుల గూడానికి చెందిన కుమార్ అనే యువకుడు పనిచేస్తూ ఉంటాడని అతను చేసిన ఒక పని వలన ఆ ఊరు ఎలాంటి ప్రమాదంలో పడింది అనేది ఈ కథ ట్విస్ట్ అని తెలిపారు. ఈ సినిమాకి 40 మంది పని చేయగా అందులో ముగ్గురు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే అని ఇద్దరు నటులుజ్ఞానేష్ అనంతపురం , నాగేంద్ర ఆదోని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తారని తెలిపారు. ఈ సినిమా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఏటూరు నగరం అడవి ప్రాంతంలో చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా సుమారు 200 థియేటర్లలో శుక్రవారం రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చిత్ర బృందంతెలిపారు.

First published:

Tags: Kurnool, Local News, Telangana

ఉత్తమ కథలు