Murali Krishna, News18, Kurnool.
విషాదం (Tragedy) అంటే ఇదే.. ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరైనా కన్నీరు పెట్టుకోకుండా ఉండలేరు.. ఎందుకంటే.. వైద్యం కోసం వెళుతున్న ఓ వ్యక్తి మార్గ మధ్యలోనే బస్సులో మృత్యు ఒడికి చేరాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా (Kurnool District) ఆత్మకూరు పట్టణంలో జరిగింది. పాములపాడుకు చెందిన 45 ఏళ్ల విజయ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం తల్లిదండ్రులను తోడు తీసుకుని నంద్యాల (Nandyala) కు బయల్దేరారు. ఆత్మకూరు బస్టాండుకు చేరుకుని నంద్యాల బస్సు ఎక్కారు. బస్సు ఎక్కే సమయంలోనే ఆయాసంతో ఇబ్బంది పడుతుండగా కష్టపడి ఎక్కించినట్లు తల్లిదండ్రులు చెప్పారు.
బస్సు సీట్లో కూర్చున్న విజయకుమార్లో కదలికలు లేకపోవడాన్ని గుర్తించిన తోటి ప్రయాణికులు అతన్ని కదిలించడంతో పక్కకు ఒరిగిపోయారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బషీర్ బస్టాండు చేరుకుని విజయకుమార్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
కర్నూలు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం…!
కూతురిని కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్లి ఓ తండ్రి ప్రాణాలు వదిలిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేడియో స్టేషన్ వెనక భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీకొని ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఇటీవల కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతుండడం ఆందోళన పెంచుతోంది.
ఇదీ చదవండి : ఛీఛీ రోడ్డుపై ఆ పనేంటి.. ఉన్నత పదవిలో ఉన్నా పాడు బుద్ధి ఏంటి..?
కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన బండారి మధు, బాగా రాజేశ్వరిలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధు పెద్ద కుమార్తె కర్నూలులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుమార్తెను కళాశాల వద్ద వదిలి సాయం కాలం తీసుకొచ్చేవాడు. ఉదయం కుమార్తెను తీసుకొని కళాశాలకు బయలుదేరగా మార్గం మధ్యలో ఎదురుగా కూలీలతో వెళ్తున్న మరో ఆటో వేగంగా వచ్చి వీరి ఆటోని ఢీకొంది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా మధు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూతురు సలోమికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు మధు రెండు కళ్ళను దానం చేస్తారు. ఈ ప్రమాదానికి కారణమైన మరో ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూల్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Kurnool, Local News