• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • KURNOOL TOMORROW CORONA VACCINE BREAK IN ANDHRA PRADESH ONLY SECOND DOSE WILL SUPPLY NGS

Andhra Pradesh: వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకేనే వారికి షాక్. రేపు బ్రేక్? ఎందుకో తెలుసా?

Andhra Pradesh: వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకేనే వారికి షాక్. రేపు బ్రేక్? ఎందుకో తెలుసా?

ఏపీలో రేపు కరోనా వ్యాక్సిన్ కు బ్రేక్

ఇటీవల నిల్వలు లేక ఏపీలో చాలా చోట్ల కరోనా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ఇఫ్పుడు కేంద్రం నుంచి మళ్లీ వ్యాక్సిన్ డోస్ రావడంతో వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకుందామనుకునే వారికి వైద్య ఆరోగ్య శాఖ షాక్ ఇస్తోంది.

  • Share this:
    ఏపీపై కరోనా పంజా విసురుతోంది.. సెకెండ్ వేవ్ లో మరింత వేగంతో విజృంభిస్తోంది. ఇప్పటికే ఏపీలో ఒక రోజులో నమోదైన కేసుల సంఖ్య పది వేల మార్కుకు చేరువైంది. దీంతో పరిస్థితి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేవలం కరోనా కేసులు పెరగడమే కాదు మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. కేవలం ఏపీ ఒక్కటే కాదు ప్రపంచం మొత్తం కరోనా కారణంగా చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా ఊహించని స్థాయిలో విస్తరిస్తున్నా.. ప్రస్తుతానికి లాక్ డౌన్ ఉండదని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. కానీ పరిస్థితి అయితే చేయిదాటిపోయినట్టే కనిపిస్తోంది. నమోదవుతున్న కేసులు చూస్తుంటే. అందుకే చాలా రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు విధించాయి. ఆంక్షలను కఠినం చేస్తున్నాయి. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూతపడుతున్నాయి. ప్రజలంతా బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

    పలు రాష్టాల్లో నైట్ కర్ఫ్యూ విధించినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు అలాంటి చర్యలను ప్రకటించలేదు. కొన్ని జిల్లాల్లో పరిస్థితులు బట్టి అక్కడి అధికారులే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రోజూ వేయికి పైగా కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ పెరుగుతున్న కరోనా కేసులకు వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన ఆయుధం అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ కూడా పంపిణీ చేసింది. అంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఇప్పుడు ఇప్పడు అంతా వ్యాక్సినేష్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

    ఏపీలో మొన్నటి వరకు చాలా చోట్ల వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. అందుకే కరాణంగా నిల్వలు లేకపోవడమే. మళ్లీ కేంద్రం రాష్ట్రానికి వ్యాక్సిన్ డోస్ లు పంపించడంతో తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో గురువారం చాలామంది వ్యాక్సినేషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ అలాంటి వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ షాక్ ఇస్తోంది. ఏంటి ఆ షాక్ అనుకుంటున్నారు. అయితే అందరూ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాలని కోరిన వైద్య ఆరోగ్య శాఖ. దాదాపు ఐదు లక్షల కోవిషీల్డ్, లక్ష కోవాక్సిన్ డోసులు ఆయా జిల్లాలకు సరఫరా చేశామన్నారు. అయితే గురువారం ఎవరికీ మొదటి డోస్ వెయడం లేదని చెబుతూ షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని అంతా గమనించాలని కోరారు. ఎందుకంటే గురువారం కేవలం రెండో డోస్ మాత్రమే వేస్తారని వెల్లడించారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తొలి డోస్ తీసుకుని ఎదురు చూస్తున్నవారికి రెండో డోస్ ఇవ్వాలని వైద్యాధికారులు భావిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు