Home /News /andhra-pradesh /

KURNOOL TOMATO LORRY LOST CONTROL AND OVERTURNED WHICH IS GOING TO BANGALORE NASHIK KNL NJ ABH

Kurnool: అదుపుతప్పి బోల్తా పడిన లారీ..! బెంగుళూరు- నాసిక్‌కు టమోట లోడ్‌తో వెళ్తున్న లారీ..!

హర్ ఘర్ తిరంగా రెప రెపలు

హర్ ఘర్ తిరంగా రెప రెపలు

టమాట లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా…రోడ్డుపై గుంతల వల్ల ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి వ్యక్తి మృతి...అదుపుతప్పి గుంతలో పడి తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం.. ఇలాంటి కర్నూలు జిల్లా క్రైమ్‌ వార్తల రౌండప్ ఒకసారి చూద్దాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    T.Murali Krishna, News 18, Kurnool

    టమాట లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా…రోడ్డుపై గుంతల వల్ల ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి వ్యక్తి మృతి... అదుపుతప్పి గుంతలో పడి తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం.. ఇలాంటి కర్నూలు జిల్లా క్రైమ్‌ వార్తల రౌండప్ ఒకసారి చూద్దాం.

    టమోట లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ఘటన కర్నూలు మండలం పంచాలింగాల టోల్‌గేట్‌ వద్ద జరిగింది. ఉదయం నాలుగు గంటల సమయంలో బెంగళూరు నుంచి నాసిక్ వెళ్తున్న టమాటో లోడ్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా… ఎలాంటి ప్రాణనాష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    అదుపుతప్పి గుంతలో పడ్డ తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్:
    కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం ఎదురుగా వేగంగా వస్తున్న తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ డివైడర్‌ను ఢీకొని పక్కనే ఉన్న నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బనగానపల్లె మండలం నందివర్గం గ్రామానికి చెందిన డ్రైవర్ సాంబశివుడుకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

    ప్రాణం తీసిన గుంత..!
    హలహరి మండలం కామినల్ గ్రామానికి చెందిన ఎర్రిస్వామి (55) కామినహాల్లో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. తనకున్న వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. పొలానికి పురుగులమందు తెచ్చేందుకు బళ్లారికి వెళ్లి తిరిగి బస్సులో వస్తుండగా…చత్రగుడి వద్ద దిగేందుకు బస్సులో నిల్చుని ఉండగా అనుకోని ప్రమాదం ఎదురైంది.

    రహదారిపై గుంత ఉండడంతో బస్సు డ్రైవర్ సడెన్‌ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో బస్సులో దిగేందుకు నిల్చున్న ఎర్రిస్వామి ప్రమాదవశాత్తు బస్సులో నుంచి జారి పడిపోయాడు. వెంటనే గమనించిన ప్రయాణికులు సిబ్బంది అతడిని ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో బళ్లారికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మరణించాడు.

    రైలు ఎక్కబోయి...!
    చిప్పగిరి మండలం గుమ్మనూరులో నివాసముంటున్న రిటైర్డ్‌ ఉద్యోగి అయోధ్యరాముడు లక్ష్మీదేవి కుమారుడైన సంతోష్ ఏడాది క్రితం రోడ్డు ప్రమాదం జరిగి మతిస్థిమితం కోల్పోయాడు. సోమవారం మధ్యాహ్నం బళ్లారికి వెళ్లేందుకు గుమ్మనూరులో కదిలే రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

    Read this also; Kurnool: హర్ ఘర్ తిరంగా రెప రెపలు.. కర్నూలులో భారీ జాతీయ జెండా.. ప్రత్యేకత ఏంటంటే?



    ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొని…!
    కర్నూలులోని స్థానిక కృష్ణ నగర్‌కు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై డోన్ వైపు వెళ్తుండగా… వెనకనుంచి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. రాఘవేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Crime news, Kurnool, Local News

    తదుపరి వార్తలు