(T.Murali Krishna,News18,Kurnool)
పట్నం పోతాను మామ... పట్నం పోతాం మామ.... పల్లె ఇడిసి పొట్ట కూటి కోసం మేము పట్నం పోతాం మామ వినడానికి వింత అయినా కర్నూలు(Kurnool)జిల్లాలోని బడుగు బలహీనవర్గాల కూలీల మాటలివి. కర్నూలు జిల్లా కోసిగి(Kosigi), సిరిగుప్ప (Siriguppa), ఆస్పరి(Aspari)తదితర ప్రాంతాల ప్రజలు వలస బాట పట్టారు. గత పదిహేను రోజుల జిల్లా నుంచి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 10వేలకు పైగా కుటుంబాలు ఉపాధి (Employment) కోసం వలస వెళ్లాయంటే ఇక్కడ జిల్లాలో ప్రజలు ఎంత దుర్బరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు అనేది అర్థమవుతోంది.
గ్రామీణ ప్రజల వలస బాట..
గడిచిన వారం రోజులలో ఒక్కరోజే కోసిగితో పాటు చిర్తనకల్లు, మూగలదొడ్డి, అగసనూరు, చింతకుంట, చిన్నభోంపల్లి, దుద్ది, ఆర్లబండ ఇలా తదితర గ్రామాల నుంచి వేయికి పైగా కుటుంబాలు కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాలకు ఇల్లు వదిలి మూటముర్ల సర్దుకుని పిల్లాపాపలతో పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిపోయారు. స్థానికంగా ఇక్కడే పల్లెలో ఉంటే పస్తులుండాల్సిందేనని, పనులు లేక రోజురోజుకు ఆర్థిక భారం ఎక్కువవుతుందని, బడి చదివే పిల్లల్ని తీసుకుని ఇతర రాష్ట్రాలకు పొట్ట చేతబట్టుకుని వలస కూలీలు వలస వెళ్లిపోతున్నారు.ముఖ్యంగా ఈ ఏడాది ఒకవైపు నకిలీ విత్తనాలు, మరోవైపు అధిక వర్షాలతో చేతికొచ్చిన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
వెల వెలబోతున్న పల్లెలు..
దింతో చేసేదేమి లేక రైతులు వారితో పాటు కూలీలు సైతం వలస బాట పట్టారు. జిల్లాలో ముఖ్యంగా కోసిగిలో ఏ వీధి చూసిన తాళాలు వేసిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి ఎటుచుసిన కాలి ఇల్లు, దుమ్ము పట్టి సగానికై పైగా పల్లెలు బోసిపోతున్నాయి. పిల్లలు కూడా చదువులు మానేసి తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లడంతో పల్లెలో ఉన్న బడులలో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇలా ప్రతి ఏడాది కోసిగి తదితర ప్రాంతాలలో వలసల పర్వం నిత్యం కొనసాగుతూనే ఉంది.
ఆదుకోలేకపోతున్న ప్రభుత్వాలు..
ఎన్ని ప్రభుత్వాలు మారిన వీరి జీవన విధానం మాత్రం ఎంతకీ మారటం లేదు. పైగా ఉపాధి కల్పించాల్సిన కార్మికశాఖమంత్రి గుమ్మనూరు జయరాం మరియు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వారే అయినా ఇప్పటి వరకు ప్రజలకు కనీసం ఎలాంటి భరోసా ఇవ్వలేకపోవడం అనేది ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.అధికారుల మాటలు సైతం వారి ఆపీసుల్లోని కుర్చీలకే పరిమితమయ్యాయి. ఇప్పటికావున అధికారులు ప్రజా ప్రతినిధులు మేల్కొని ప్రజలకు ఉపాధి కల్పించి వలసల పర్వం ఆపాలని ప్రజలు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Kurnool, Local News