హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

దేవుడి కోసం పిడకల సమరం..! వందల ఏళ్ల సాంప్రదాయం

దేవుడి కోసం పిడకల సమరం..! వందల ఏళ్ల సాంప్రదాయం

X
కర్నూలు

కర్నూలు జిల్లా కైరుప్పలలో పిడకల సమరం

మన దేశంలో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. పండగల సందర్భంగా జరిగే ఉత్సవాలు, వేడుకలు చాలా వింతగా అనిపిస్తాయి. అలాంటి ఆచారాలు గ్రామాల్లో ఎక్కువగా పాటిస్తారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఓ వింత ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

మన దేశంలో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. పండగల సందర్భంగా జరిగే ఉత్సవాలు, వేడుకలు చాలా వింతగా అనిపిస్తాయి. అలాంటి ఆచారాలు గ్రామాల్లో ఎక్కువగా పాటిస్తారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఓ వింత ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఉగాది (Ugadi) సందర్బంగా కైరుప్పల గ్రామంలోశ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతున్నారు. అక్కడి ప్రజలు.గ్రామంలో వెలసిన వీరభద్ర స్వామి ఉత్సవాల్లో భాగంగా. ఉగాది తర్వాత ఈ గ్రామంలో పిడకల సమరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతి ఏటా ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక ఒక్క ప్రత్యేక కథప్రచారంలో ఉందట.

పూర్వం త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర తెలుపుతుంది అని గ్రామస్తులు అంటున్నారు. వారి ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది. పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తమ భద్రకాళి దేవిని.. వీరభద్ర స్వామి మోసం చేశారని అమ్మ వారి భక్తులు నమ్మి.. వీరభద్ర స్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు.

ఇది చదవండి: నంది వర్ధనాల సాగు.. అందంతో పాటు లాభాలు కూడా..!

ఈ విషయం తెలుసుకొన్న వీరభద్ర స్వామి భక్తులు.. అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్ర స్వామిని వెళ్లవద్దని వేడుకొన్నారని స్థానికులు అంటున్నారు. స్వామి.. భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని, అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామి వారిపై పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు.

ఇది చదవండి: తక్కువ ధరకే ఎలక్ట్రికల్ సూపర్ కార్.. ఆటో డ్రైవర్ అద్భుత సృష్టి

ఈ విషయం తెలుసుకున్న స్వామి వారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి.. అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగారని, అలా ఇరువర్గాలు పిడకల సమరం సాగించారని అంటుంటారు. వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయాన్ని విశ్వకర్మ (భద్రకాళి అమ్మ వారి తండ్రి) బ్రాహ్మదేవునికి చెప్పారని, బ్రహ్మ దేవుడు.వీరభద్ర స్వామి తండ్రి శివుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారని, అనంతరం బ్రహ్మ దేవుడు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారని అంటుంటారు.

అప్పటి నుంచి ప్రతి యేటా ఉగాది సందర్బంగా పిడకల సమరం జరుపుకోవడం అనవాయితీగా వస్తున్న ఆచారం అంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. పైగాపిడకల సమరంలో దెబ్బలు తగిలినవారు భద్రకాళి అమ్మవారు, వీరభద్ర స్వామి వార్ల ఆలయాలకు వెళ్లి.. నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న విభూదిని ఇరువర్గాల భక్తులు రాసుకుని రావాలని బ్రహ్మ ఆదేశించాడని, ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కల్యాణం జరిపిస్తామని బ్రహ్మ దేవుడు మాట ఇచ్చినట్లు ఆలయ పురాణాలూ ఆలయా చరిత్ర చెబుతుంది.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News