హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఎవరైనా కరుణిస్తేనే కడుపు నిండేది.. ఈ కుటుంబాన్ని గట్టెక్కించేదెవరు..!

ఎవరైనా కరుణిస్తేనే కడుపు నిండేది.. ఈ కుటుంబాన్ని గట్టెక్కించేదెవరు..!

X
కర్నూలు

కర్నూలు జిల్లాలో సాయం కోసం అర్థిస్తున్న కుటుంబం

అసలే నిరుపేద కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. చిన్న కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిపి ఆటో నడుపుతూ హాయిగా సాగిపోతున్న కాంతారావు కుటుంబాన్ని ఓ వ్యాధి ఆ కుటుంబాల్లో విషాదం నింపింది

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

అసలే నిరుపేద కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. చిన్న కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిపి ఆటో నడుపుతూ హాయిగా సాగిపోతున్న కాంతారావు కుటుంబాన్ని ఓ వ్యాధి ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. మొదట తమ్ముడుని కబళించిన కీళ్లవాతం అనే మహమ్మారి తమ్ముడి మరణానంతరం అన్నయ్యను పట్టుకుంది. గత రెండు సంవత్సరాలుగా కీళ్లవాతంతో మంచానికి పరిమితమయ్యాడు కాంతారావు. కుటుంబంలోని పెద్ద... మంచానికి పరిమితం కావడంతో ఆ పేద కుటుంబానికి మరిన్ని కష్టాలు తోడయ్యాయి.

కర్నూలు జిల్లా (Kurnool District) కోడుమూరు నియోజకవర్గం స్టాంటాన్ పురం ప్రాంతానికి చెందిన రాచపూడి ఏసన్న మార్తమ్మలకు ముగ్గురు కుమారులు. అందులో పెద్దవాడైనా రాచపూడి కాంతారావు సొంతంగా ఆటో కొనుక్కొని ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. మరో కుమారుడు చంద్రశేఖర్ డిగ్రీ వరకు చదువుకున్నారు. మూడో కుమారుడు కార్తీక్ ఇంటర్ వరకు విద్యను అభ్యసించి ఆటో డ్రైవర్ గా జీవనం సాగించేవాడు. ఇలా హాయిగా సాగిపోతున్న వారి కుటుంబాన్ని కీళ్లవాతం అనే మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

ఇది చదవండి: ఆ దంపతుల వృత్తి కలెక్టర్.. కానీ ప్రవృత్తి మాత్రం వేరే ఉంది.. తెలుస్తే దండం పెడతారు..!

కుటుంబంలో పెద్దవాడైన కాంతారావు గత 15 సంవత్సరాలుగా కీళ్లవాతంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ కుటుంబానికి భారం కాకూడదని ఆలోచనతో కుటుంబ పోషణ కోసం ఆటోతో జీవనం సాగించేవాడు. గత రెండు సంవత్సరాలుగా వ్యాధి తీవ్రంగా మారడంతో లేవలేని పరిస్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. దీంతో ఆ కుటుంబం భారం అంతా కాంతారావు భార్య ఝాన్సీ పైనే పడింది. కుటుంబ భారం అంతా మోస్తూ వ్యవసాయ పనులకు వెళ్లాల్సి వస్తుంది. రోజంతా కూలి పని చేస్తే 200 రూపాయలు రావడంతో ఆ వచ్చిన డబ్బుతో అటు భర్తకు వైద్యం చేయించలేని పరిస్థితి ఇటు పిల్లలని చదివించలేని పరిస్థితి ఏర్పడడంతో. ఆమె కన్నీరు మున్నీరావుతుంది.

గత రెండు సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన ఆ కుటుంబం. కనీసం స్థానిక ఎమ్మెల్యే స్పందించి. తన భర్తకు పెన్షన్ ఇప్పించాలని పలుమార్లు ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోవడంతో వారికి నిరాశ మిగిలింది. కనీసం దాతలు ఎవరైనా స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబంలోని పిల్లలు వేడుకుంటున్నారు.

రాచపూడి ఝాన్సీ

Acc No :- 9109 8170 288

IFSCcode :-APGB0003194

Branch :- kurnool

Phone pay :-7569084185

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు