హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఈ కూల్ డ్రింక్స్‌లో ఏదో మ్యాజిక్ ఉంది.. టేస్ట్ మాములుగా ఉండదు

ఈ కూల్ డ్రింక్స్‌లో ఏదో మ్యాజిక్ ఉంది.. టేస్ట్ మాములుగా ఉండదు

X
వేసవి

వేసవి తాపాన్ని తగ్గించే నన్నారి

వేసవికాలం (Summer) మొదలైందంటే చాలు మనుషులంతా ఆ వేడి నుండి సత్వర ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన చల్లటి పదార్థాలు తీసుకుంటూ సేద తీరుతూ ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

వేసవికాలం (Summer) మొదలైందంటే చాలు మనుషులంతా ఆ వేడి నుండి సత్వర ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన చల్లటి పదార్థాలు తీసుకుంటూ సేద తీరుతూ ఉంటారు. ఎండాకాలం భగభగ మండే భానుడి యొక్క వేడి నుంచి సత్వర ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్లు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా వేసవిలో కూల్ డ్రింక్స్ కు పెరిగే గిరాకీని దృష్టిలో ఉంచుకొని చాలామంది కల్తీ కూల్ డ్రింక్స్, నాసిరకం కూల్ డ్రింక్స్ వంటి వాటితో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అందులోనూ వేసవి కదా అని చెప్పి ప్రజలు చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతూ తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. అలా వేసవి నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి ఇదొక చక్కటి చిట్కా.

సాధారణంగా వేసవికాలం నన్నారి, లెమన్, లస్సి మజ్జిగ వంటి వాటికి గిరాకీ బాగా పెరుగుతుంది. కానీ అందులో ఏది సత్వర ఉపశమనాన్ని కలిగిస్తుంది. అందులో ఏది ఆరోగ్యానికి మంచిది అనేది చాలామందికి సందిగ్ధత నెలకొంటూ ఉంటుంది. అలాంటి వారికి ఇది ఒక చక్కని ఉదాహరణ. నన్నారేలోకి కెళ్ళా ఈ నన్నారి టేస్ట్ సూపర్ హిట్..!

ఇది చదవండి: ఈ తాబేళ్లు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుందా..? ఆ నమ్మకం నిజమేనా..?

నన్నారిలో కెల్లా ఈ స్పెషల్ కటోర నన్నారికి ఉండే టెస్ట్ మామూలుగా ఉండదు. సహజ సిద్ధమైన బాదం చెట్ల నుంచి వచ్చే బంకను అలాగే సహజ సిద్ధమైన నన్నారీ వేర్లతో తయారుచేసిన నన్నారిని ఈ కటోర బంకను నన్నారిలో కలుపుకొని తాగడం వలన శరీర ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేసుకొని వేడి నుంచి సత్వరమై ఉపశమనం పొందచ్చంటున్నారు.

ఇది చదవండి: పనస సాగు ఎలా చేస్తారో తెలుసా..? దానిలో పోషక విలువలెన్నో..!

కటోరా అనే పదార్థం బాదం చెట్టు జిగురుతో తయారవుతుందంట. అయితే ఈ జిగురును రాత్రి వేళ నీటిలో ఉంచి, మరుసటి రోజు చూసిన యెడల జిగురు వెళ్లి ఓ మెత్తని పదార్థంలా తయారవుతుంది. దీనినే కటోరా అంటారు.ఈ కటోరా రుచి మాత్రం చప్పగా ఉండడంతో.. రుచికై తేనె, పాలు వంటి పదార్థాలను కలిపి కూల్ డ్రింక్స్ దుకాణ యజమానులు ఒక్కొ గ్లాస్ ధర రూ. 20 లతో విక్రయిస్తుంటారు.

ఎలాంటి రసాయన పదార్థాలను వాడకుండా కేవలం సాధారణ మొక్కలతోనే తయారు చేసే ఈ కటోర నన్నారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనివల్ల శరీరంలో ఉండే వేడి తగ్గడమే కాకుండా వడదెబ్బ తగిలిన వారికి కూడా సత్వరమే ఉపశమనం పొందే విధంగా శరీర ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేసి ఉపయోగపడుతుంది. కర్నూల్ పట్టణంలో ప్రతి ఏడాది సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రాంగణంలో లభించే ఈ కటోర నన్నారే తాగడానికి ప్రజలు ఆసక్తి పరుస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు