హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: ఆ ఏకదంతుని దర్శించుకోవాలంటే ఏడు గడపలు దాటాల్సిందే..! పరవశించిపోతున్న భక్తులు

Kurnool: ఆ ఏకదంతుని దర్శించుకోవాలంటే ఏడు గడపలు దాటాల్సిందే..! పరవశించిపోతున్న భక్తులు

కర్నూలులో

కర్నూలులో ఆకట్టుకుంటున్న తిరుమల థీమ్ వినాయకుడు

తిరుమల (Tirumala) లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఏడుకొండలు ఎక్కి వెళ్లినట్టు.. ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవాలంటే ఏడు గడపలు దాటి వెళ్లాల్సిందే..! అది ఎక్కడో కాదు..మన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని కర్నూలు (Kurnool) లోనే..!

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  తిరుమల (Tirumala) లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఏడుకొండలు ఎక్కి వెళ్లినట్టు.. ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవాలంటే ఏడు గడపలు దాటి వెళ్లాల్సిందే..! అది ఎక్కడో కాదు..మన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని కర్నూలు (Kurnool) లోనే..! రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కర్నూలులో ఏర్పాటు చేసిన తిరుమల వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. బాలాజీ థీమ్‌తో తయారుచేసిన గణనాథుని మండపం ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మండపం డెకరేషన్‌ కూడా చాలా గ్రాండ్‌లా డిజైన్‌ చేశారు. కళ్లుచెదిరేలా ఉన్న పందిరి, బంగారు వర్ణంలోని ఏడు గడపలు, మెరిసిపోతున్న తిరుమల గోపురం..ఇలా ఎంతో అందంగా గణనాథుని మండపాన్ని తీర్చిదిద్దిన తీరు అమోఘం. ఆ విఘ్ననాథుని దర్శించుకోవాలంటే అరగంట క్యూలో వేచి ఉండాల్సిందే. అంతలా ఆ మండపంలో భక్తులు కోలాహలం ఉంది.

  వినాయక చవితి వచ్చిందంటే చాలు వాడవాడలా సందడి మొదలవుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల వరకు కుల మతాలకతీతంగా కలిసి జరుపుకునే తొలి పండగ వినాయక చవితి. ప్రతిరోజు హడావిడిగా పని చేసుకుని సాయంకాలం సీరియల్స్ చూస్తూ టీవీలకు అతుక్కుపోయేవాళ్లంతా వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఆ పందిరి, మండపాల దగ్గర ఆటపాటలతో సరదాగా గడుపుతుంటారు. అందుకే ఎక్కువ శాతం యువత కూడా వినాయక చవితిని ఇష్టపడుతుంటారు.

  ఇది చదవండి: కంపు కొడుతున్న సాగర తీరం.. అధికారులు అలర్ట్‌ అవ్వకపోతే అంతే సంగతులు..!


  కర్నూలులోని స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్న రామలింగేశ్వర నగర్‌లోని వినాయక భక్త బృందం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన తిరుమల శ్రీ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వినాయకుడిని దర్శించుకోవాలంటే ఏడు గడపలు దాటి వెళ్లాల్సిందే. అచ్చం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి ఎలాగైతే ఏడుకొండలెక్కి ఏడు గడపలు దాటి వెళతామో అదేవిధంగా ఈ తిరుమల శ్రీ వినాయకుడిని దర్శించుకోవడానికి ఏడుగడపలు దాటి వెళ్లే విధంగా భారీ సెట్టింగ్‌తో ఏర్పాటు చేశారు.

  ఇది చదవండి: A టు Z ఏదైనా.. అతి తక్కువ ధరకే.. ప్రత్యేకంగా నిలుస్తున్న సండే మార్కెట్


  ఆ ఏడూ గడపలు దాటి వెళ్ళగానే తిరుపతి గర్భగుడి ఆకారంలో ఒక ఆకృతిని ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ దాటిన తర్వాతే వినాయకుడు మనకు దర్శనం ఇస్తాడు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకొనున్న గణనాథుడికి రామలింగేశ్వర నగర్ వినాయక భక్తి బృందం కమిటీ సుమారుగా రూ.40 లక్షలు ఖర్చు చేసి ఏర్పాటుచేసింది. ఈ ఏర్పాట్ల గురించి తెలుసుకున్న లోకాయుక్త చీఫ్ జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి స్వయంగా ఇక్కడికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన లక్ష్మణ రెడ్డిని కమిటీ సభ్యులు ఆది మోహన్ రెడ్డి, ఎం.రాజేశ్వర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.

  ఈ మండపం దగ్గర ప్రతిరోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. భజనలు, సైరా నరసింహారెడ్డి చరిత్ర నాటక ప్రదర్శన, ఆనంద నిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర నాటక ప్రదర్శన వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్ వంటి వివిధ రకాల ఆటలు పాటల పోటీలు పెట్టి అందులో గెలుపొందిన వారికి బహుమతులు ఇస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫీలింగ్‌ ఉందని భక్తులు తన్మయత్వం చెందుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News, Vinayaka Chavithi 2022

  ఉత్తమ కథలు