హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: ఇంటికి తాళం వేసినా సొత్తుకు నో గ్యారెంటీ.. వీళ్ల కన్నుపడితే అంతే సంగతులు

Kurnool: ఇంటికి తాళం వేసినా సొత్తుకు నో గ్యారెంటీ.. వీళ్ల కన్నుపడితే అంతే సంగతులు

కర్నూలు జిల్లా ఆదోనిలో వరుస దొంగతనాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో వరుస దొంగతనాలు

కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ప్రజలు ఇళ్లకు తాళం వేసి ఊరికెళ్లాలంటేనే భయపడే పరిస్థితి.

 • News18 Telugu
 • Last Updated :
 • Adoni, India

  Murali Krishna, News18, Kurnool

  కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ప్రజలు ఇళ్లకు తాళం వేసి ఊరికెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. ఈ మధ్యకాలంలోనే స్థానిక షరాఫ్ బజార్లోని జువెలరీ షాప్ దొంగతనం, బైక్స్ దొంగతనం, ఇలా వరుస దొంగతనాలు ఆదోని పట్టణవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఆదోని పట్టణంలోని ఒకే వీధిలో మూడు ఇళ్లల్లో చోరీ జరగడంతో ఆ కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.రాత్రి వేళలో తాళాలు వేసిన ఇళ్లనే దుండగులు కొల్లగొట్టారు. ఆదోని పట్టణంలోని మహాత్మ గాంధీ నగర్‌లో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్‌ ఎస్‌ఐ హనుమంతు రెడ్డి బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

  కురువ లక్ష్మి ఇంట్లో రూ.1.30 లక్షలు, పది తులాలు బంగారం, 115 తులాల వెండి చోరీకి గురైందని వాపోయారు. నాగేంద్రమ్మ ఇంట్లో తులం బంగారు, రూ.1000 నగదు, ఈరమ్మ ఇంట్లో రూ.6 వేల నగదు, తులం బంగారు దొంగలు దోచుకెళ్లారని తెలిపారు. రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి రక్షణ కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

  ఇది చదవండి: పుష్ప సినిమా స్టైల్లో గంజాయి అక్రమ రవాణా..! పోలీసులిచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదు..!

  నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు..!

  ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్రమ నాటుసారా స్థావరాలపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఎక్కడికక్కడ నాటు సారా స్థావరాలపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ నాటుసారా బట్టిలను ధ్వంసం చేస్తున్నారు. సారా తయారు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆర్.రమణ ఆధ్వర్యంలో గడివేముల మండల పరిధిలో సోదాలు నిర్వహించారు.

  ఇది చదవండి: మందు బాబుల గుండె పగిలే దృశ్యాలు..! మద్యం బాటిళ్లను రోడ్డురోలర్‌తో తొక్కించిన పోలీసులు..!

  తిరుపాడు గ్రామం చివర కుందు నది పరివాహక ప్రాంతాల్లో నాటు సారా తయారు చేసే బట్టీ ఉందని వచ్చిన సమాచారం మేరకు రమణ ఆధ్వర్యంలో సెబ్ పోలీసులు మరియు స్థానిక పోలీసులు కలిసి దాడులు చేశారు. అక్కడ సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను గుర్తించారు. ఈ నాటు సారా తయారు చేసే బట్టి ఎవరిదన్న దానిపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధిస్తామని అడిషనల్ ఎస్పీ రమణ తెలిపారు.

  ఈ సందర్భంగా తిరుపాడు గ్రామంలో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎవరైనా నాటు సారా తయారీ, రవాణా, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సారా తయారు చేసేవాళ్లు ఎవరైనా తమ పద్ధతిని మార్చుకోకపోతే పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించేందుకు కూడా వెనుకాడబోమని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆర్.రమణ గారితో పాటు సెబ్ సీఐ బి.నాగమణి గారు, ఎస్సై శ్రీ లక్ష్మీ, శ్రీ పాణ్యం సీఐ వెంకటేశ్వరరావు, గడివేముల ఎస్సై బిటి .వెంకటసుబ్బయ్య సిబ్బంది పాల్గొన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు