T. Murali Krishna, News18, Kurnool
మారుతున్న నేటి ఆధునిక యుగంలో మనిషి ఆహారపు అలవాట్లు అనేక రోగాలను తెచ్చిపెడుతున్నాయి. మనిషికున్న బిజీ బిజీ సమయాల్లో ఇంట్లో వండుకొని తినే సమయం దొరకక బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ తినే అనేక రోగాలకు గురవుతున్నారు. బయట దొరికే ఫాస్ట్ పుడ్లలో ఎక్కువ శాతం మసాలాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యానికి హానే కలిగే అవకాశాలు ఎక్కువ. బయట లభించే ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల మనిషికి గ్యాస్ ట్రబుల్ ఆ జీర్తి ఇలా అనేక రోగాలు మనిషి ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తాయి.
ఆ రోగాలను నయం చేసుకోవడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసుకొని ఎదుర్కొంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఎన్ని మందులు వాడినా కూడా రోగాలు నయం కావు అలాంటి పరిస్థితులలో మనిషి యొక్క జీవన శైలిని మార్చే విధంగా యోగా అనేది తోడ్పడుతుంది. ప్రతిరోజు యోగ ఆసనాలు వేయడం ద్వారా మనిషి యొక్క మానసిక స్థితితో పాటు ఆరోగ్యం పరిస్థితి కూడా మెరుగు పడుతుంది.
ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మనిషి యొక్క మానసిక శారీరక రోగాలను నయం చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే అత్యధికంగా ఎక్కువ శాతం మనసులో ఇబ్బంది పడేది అధిక బరువు కొవ్వు పేరుకుపోవడం గ్యాస్ ట్రబుల్ మరియు పెన్ను నొప్పి మెడనొప్పి ఇలాంటివి మనిషిని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వాటిని త్వరగా నయం చేసుకోవడానికి యోగా అనేది ఒక చక్కటి అవకాశం.
ఎక్కువ శాతం మనుషులు అధిక బరువు కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం అజిర్తి సమస్యలు ఎదుర్కొంటారు అలాంటి వారికోసం యోగాలోని ముఖ్యమైన వజ్రాసనం వేయడం ద్వారా అధిక బరువును తగ్గించడంలో వజ్రాసనం మరియు మండుకాసనం అనేది ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఈ వజ్రాసనం మరియు మండుకాసనం వేయడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవడమే కాకుండా మంచి శరీరాకృతిని పొందడంలో ఈ రెండో ఆసనాలు ఎంతో మేలు చేస్తాయి.
అదేవిధంగా యోగాలోని ముఖ్యమైనది అర్దహలాసనం. ఈ అర్థహాలాసనం ద్వారా ఎక్కువ శాతం నడుము నొప్పి కాళ్ల నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు అరగంట పాటు ఈ ఆసనం చేయడం ద్వారా నడుము నొప్పి మెడ నొప్పి వంటి బాధలు ఉన్నవారికి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News