Crime: భర్త కనిపించడం లేదని పోలీసులకు భార్య ఫిర్యాదు.. విచారణలో వారి కొడుకు, కూతురు చెప్పింది విని పోలీసుల షాక్​.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

కర్నూల్లోని ఓ పోలీస్​ స్టేషన్లో తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. అయితే ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో.. పోలీసులు సదరు వ్యక్తి కొడుకు, కూతురిని విచారించారు. ఆ విచారణలో పోలీసులకు షాకింగ్​ విషయాలు తెలిశాయి..

 • Share this:
  అక్రమ సంబంధాలు (Extra marital affairs) ఒక మనిషి జీవితాన్నే కాదు కుటుంబాలనే రోడ్డున పడేస్తాయి. పరువు బజారున పడుతుంది. సంసార సుఖంలో ఇబ్బందులు, పాత ప్రేమికులు (lovers), కామ వాంఛ ఏదో ఒక కారణంతో వివాహేతర, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ సంబంధాలతో కుటుంబాలతో పాటు స్వంత పిల్లలపై అనేక దుష్ప్రభావాలు పడుతుంటాయి.. దీంతో వారు మానసికంగా కృంగిపోతారు. తమ ఇంట్లో జరుగుతున్న సంబంధాలను (affairs) ఎవరికి చెప్పుకోవాలో తెలియకు సతమవుతూ ఉంటారు.

  అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో..

  అయితే ఇవి ఎన్నో రోజులు సాగవు. చిన్నచిన్న గొడవలు ఏకంగా చంపేసుకోవడం (murders) దాకా దారి తీస్తున్నాయి. అక్రమ సంబంధాల వలపులో పడి అయిన వారిని దూరం చేసుకుంటున్నవారు కొందరైతే.. ఇంట్లో వారినే మట్టుబెట్టేవారు ఇంకొందరు. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి జీవిత భాగస్వామిని చంపేసిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా కర్నూలు (Kurnool) జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది.

  ప్రియుడితో పెట్టుకున్న అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ఓ వివాహిత భర్తను మట్టుబెట్టింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన రామయ్య (ramayya) పండ్ల వ్యాపారం (fruit business) చేస్తూ జీవనం కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య జయలక్ష్మి (Jaya Laxmi) అదే గ్రామానికి చెందిన మహ్మద్ కైజర్‌తో గత రెండు సంవత్సరాల నుంచి అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది.

  భర్త మందలించడంతో..

  అయితే భార్య ప్రవర్తన గమనించిన భర్త రామయ్య మందలించాడు. అదుపులో ఉండమని సూచించాడు. దీంతో తమకు అడ్డుగా ఉన్నాడని భావించి భర్త రామయ్యను హతమార్చడానికి భార్య జయ లక్ష్మీ ప్రణాళిక వేసింది. సెప్టెంబర్ 13వ తేదీన భర్త గొంతుకు టవల్ (towel) బిగించి చంపేసింది. అనంతరం ప్రియుడి (lover)తో కలిసి గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని (dead body) హంద్రీ - నీవా కాలువలో పడవేసి మాయం చేశారు. అయితే భర్త కనిపించడం లేదని  పోలీస్​ స్టేషన్​కు వెళ్లి తప్పుడు కేసు పెట్టింది. తొలుత కేసు (case) నమోదు చేసుకొని విచారణ జరిపారు.

  పిల్లలను విచారించడంతో..

  అయితే విచారణలో జయలక్ష్మి కుమార్తె చందన, కొడుకు శేఖర్ పోలీసులకు చెప్పిన వివరాలు వారిని షాక్​కు గురిచేశాయి. పోలీసులకు అసలు విషయం తెలిసింది. విచారణలో వారి గుట్టు మొత్తం బయటపడింది. జయలక్ష్మి పిల్లలు హత్య జరిగే సమయంలో ఆ ఘటన చూసినట్లుగా పోలీసులు (Police) తెలిపారు. దీంతో ఇరువరిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. మృతదేహం కోసం ఓర్వకల్లు ఎస్ఐ మల్లికార్జున, నాగలాపురం ఎస్సై ప్రేమ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి, ఓర్వకల్లు ఎస్సై మల్లిఖార్జున తెలిపారు.
  Published by:Prabhakar Vaddi
  First published: