హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: పంట పండిందని నవ్వాలా లేక.. ఇలా అయినందుకు ఏడవాలా..?

Kurnool: పంట పండిందని నవ్వాలా లేక.. ఇలా అయినందుకు ఏడవాలా..?

X
రైతు

రైతు దీనావస్థ

Andhra Pradesh: మనం తినే ఏ వంటకంలోనైనా కొత్తిమీర లేనిదే వాటికి రుచి ఉండదు. శాఖాహారం మాంసాహారం అన్న తేడా లేకుండా కొత్తిమీరను నిత్యం వంటకాలకువాడుతుంటారు. ఎలాంటి వంటకం అయినా సరే అది తయారైన తర్వాత కాస్త కొత్తిమీర ఆ వంటకానికి ఉండే రుచే వేరు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(T. Murali Krishna, News18, Kurnool)

మనం తినే ఏ వంటకంలోనైనా కొత్తిమీర లేనిదే వాటికి రుచి ఉండదు. శాఖాహారం మాంసాహారం అన్న తేడా లేకుండా కొత్తిమీరను నిత్యం వంటకాలకువాడుతుంటారు. ఎలాంటి వంటకం అయినా సరే అది తయారైన తర్వాత కాస్త కొత్తిమీర ఆ వంటకానికి ఉండే రుచే వేరు. అలాంటి కొత్తిమీర పంట సాగు చేసే రైతుల పరిస్థితులు తీవ్ర అధ్వాన్నంగా మారాయి.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని కొత్తిమీర సాగు చేసిన కౌలు రైతు లక్ష్మన్న లబోదిబోమంటున్నాడు. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన కోత్తిమీర పంటకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేక పండిన పంటను గొర్రెలను మేతగా వదిలాడు. గోనెగండ్ల మండలంలో ఉన్నటువంటి రైతు లక్ష్మన్న ఓ ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. ఆ ఎకరా పొలంలో కొత్తి మీర పంటను సాగు చేస్తున్నాడు.

కొత్తిమీర పంటను సాగు చేసేందుకుగాను సుమారు రూ.60 వేలు రూపాయలు పెట్టుబడి పెట్టామని తెలిపాడు అయితే ఈ పంట 40 రోజుల్లో కోతకు వస్తుందని తెలిపాడు. ఈ పంటను మామూలు పంటలతో పోలిస్తే వీటికి చాలా కష్టపడాల్సి వస్తుందని తెలిపాడు. నిరంతరం ఈ వంటను పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపాడు. ఈ పంటను గడువులోగా కోత కోసి మార్కెట్ కి తరలించాలన్నాడు.

ఇక పంట ముదురుతే కొనేందుకు వ్యాపారులు రారని, దీంతో పంట లేతగా ఉన్న సమయంలోనే అమ్మకాలు జరగాలి కానీమార్కెట్లో మాత్రం పంటకు సరైన గిట్టుబాటు ధర పలకడం లేదని రైతు ఆవేదనా వ్యక్తం చేస్తున్నాడు. కొత్తిమీరను వ్యాపారులుబెడ్స్ప్రకారం కొనుగోలు చేస్తారని, బెడ్ ప్రస్తుతం రూ.100 పలుకుతుండగా ఒక కొత్తిమీరకట్ట రూ.5 పలుకుతూ.. వ్యాపారం రూ.10 వేలుకూడా దాటడంలేదు.

కనీసం పంట పండించేందుకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. కనీసం కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో చేసేదేమీ లేక రైతు లక్ష్మన్న...తాను ఎకరంలో సాగుచేసిన కొత్తిమీర పంటను గొర్రెలకు మేతగా వేశానని తెలిపాడు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని లేకపోతే అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఎలాగైనా ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు