(T. Murali Krishna, News18, Kurnool)
కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం ఎన్ఈపి 2020 రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. నూతన విద్యా విధానం వల్ల విద్యావ్యవస్థలో చివర గందరగోళ వాతావరణం ఏర్పడిందని అందువల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.
నూతన విద్యా విధానం వల్ల ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు మూడో కిలోమీటర్లు... ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఐదు కిలోమీటర్ల దూరంలో పాఠశాలలో ఉంటే విద్యార్థులు చదువుకు దూరమై వారి భవిష్యత్తును పాడు చేసుకుని అవకాశాలే ఎక్కువ ఉన్నాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు.విద్య ప్రమాణాలను దిగజార్చే విధంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 84, 85, 117 ను వెంటనే రద్దు చేయాలని కోరారు. వీటివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు తమ చదువును మధ్యలోనే అర్ధాంతరంగా ఆపేసుకోవాల్సి వస్తుందని విద్యను దూరం చేసుకుని తమ భవిష్యత్తును అంధకారం చేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు.
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బైజుస్ ఒప్పందాన్నిరద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాటి వల్ల ఉపాధ్యాయులు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడే అవకాశాలు ఏర్పడతాయని... విద్యార్థులకు బైజుస్ ఒప్పందం ద్వారా చేసే విద్య బోధనలు సరైనవి కావని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు సరైన ఇంటర్నెట్ అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. బైజుస్ ఒప్పందం ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయులను తగ్గించి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ అలాంటి ఆలోచనలను మానుకోవాలని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 50 వేలఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News