Home /News /andhra-pradesh /

KURNOOL TEACHER COMMITS SUICIDE AFTER HUSBAND INSULTED HIM FOR NOT HAVING KIDS IN KURNOOL CITY OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Sad News: కట్టుకున్న భర్తే అంత మాట అనే సరికి తట్టుకోలేకపోయింది... ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది

భారతి (ఫైల్)

భారతి (ఫైల్)

Wife And Husband: ఆ దంపతులకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు పిల్లల కోసం ఎదురుచూశారు. ఇలాంటి సమయంలో తోడుగా ఉండి ధైర్యం చెబుతాడనుకున్న భర్త.. బయటివారికంటే ఎక్కువగా సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశాడు.

  వాళ్లిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. అంతేకాదు బంధువులు. హాయిగా జీవిస్తారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులకు వాళ్లకు పెళ్లి చేశారు. కానీ దురదృష్టమో ఇంకేదైనా సమస్యో గానీ వారికి పిల్లలు కలగలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు పిల్లల కోసం ఎదురుచూశారు. ఇలాంటి సమయంలో తోడుగా ఉండి ధైర్యం చెబుతాడనుకున్న భర్త.. బయటివారికంటే ఎక్కువగా సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశాడు. చేసేదేం లేక ఆ ఇల్లాలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. అయిన వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు (Kurnool) నగరం పాతబస్తీకి చెందిన భారతి సి.బెళగల్ మండలం ఇకండ్ల ప్రభుత్వ పాఠశాల్లలో టీచర్ గా పనిచేస్తునారు. ఆమెకు మేనత్త కొడుకు, సొంత బావ అయిన గోపీ కృష్ణతో ఎనిమిదేళ్ల క్రితం పెద్దలు పెళ్లిచేశారు.

  భర్త స్థానిక గాంధీనగర్ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఐతే పెళ్లై ఎనిమిదేళ్లయినా వారికి పిల్లలు పుట్టలేదు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా, పూజలు చేసినా సంతానం కలగకపోవడంతో నిత్యం అవమానాలు ఎదుర్కొంటోంది. చివరకి భర్త కూడా గొడ్రాలివని.. అవమానకరంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయింది.

  ఇది చదవండి: మూడేళ్లు వెంటపడి అమ్మాయిని పెళ్లికి ఒప్పించాడు.. తాళి కట్టిన తర్వాతి రోజే ట్విస్ట్


  దీంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణంపోయింది. భర్త వేధించడం వల్లే తన చెల్లి ఆత్మహత్య చేసుకుందని భారతి అక్క సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్నూలు వన్ టౌన్ పోలీసులు గోపీకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది చదవండి: మోసానికి మేకప్ వేస్తే ఈమెలాగే ఉంటుందేమో.. పెళ్లిపేరుతో సర్వం దోచేసింది..


  ఇటీవల గుంటూరు జిల్లా (Guntur District) పొన్నారు మండలంలో ఇలాంటి దారుణం చోటు చేసుకుంది. పచ్చలతాడిపర్రుకు చెందిన ఓసోబు, చేబ్రోలుకు చెందిన మనీషాకు ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. దంపతులు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య మనస్ఫర్దలు మొదలయ్యాయి. దీంతో మనీషా పుట్టింటికి వెళ్లిపోయింది.

  ఇది చదవండి: వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ టాలీవుడ్ నిర్మాత.. బాధితుల్లో మాజీ ఎంపీ బంధువు..?


  ఐతే చిట్టీ డబ్బులు కట్టేందుకు రావాలని భార్యను ఇంటికి పిలిచిన ఏసోబు ఆమె తలపై రోకలిబండతో బలంగా మోదాడు. ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే భయపడిపోయిన ఏసోబు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకన్నాడు. కొద్దిసేపటి తర్వాత మనీషాను ఆమె తల్లి ఆస్పత్రికి తరలించగా చికిచ్స పొందుతూ మృతి చెందింది. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మధ్య మొదలైన చిన్నగొడవ చివరకు రెండు ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Kurnool, Wife suicide

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు