హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

50 మంది గిరిజన విద్యార్థినులకు అస్వస్థత... అసలేం జరిగిందంటే..

50 మంది గిరిజన విద్యార్థినులకు అస్వస్థత... అసలేం జరిగిందంటే..

X
గిరిజన

గిరిజన విద్యార్థినుల అస్వస్థత

Andhra Pradesh: నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ మెట్ట సమీపంలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చిరు పదార్థాలను తీసుకున్న విద్యార్థినిలు అస్వస్థతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ మెట్ట సమీపంలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చిరు పదార్థాలను తీసుకున్న విద్యార్థినిలు అస్వస్థతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం రాత్రి భోజనం అస్వస్థతకు గురైన విద్యార్థినీలను నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గురువారం యధావిధిగా సాయంకాలం బొరుగులను స్నాక్స్ గా తిన్నారు. సుమారు 180 మంది విద్యార్థినీలు ఇక్కడ ఉండగా వీరిలో 160 మందికి పైగా స్నాక్స్ అనంతరం ఐరన్ మాత్రలు వేసుకున్నామని తెలిపారు.

రాత్రి పప్పు బెండకాయ కూర, పప్పు అన్నం తిన్నట్లు విద్యార్థులు చెప్పారు. ఈ ఆహారం తిన్నారు. అయితే వీరిలో 50 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. వెంటేనే వీరి ఇబ్బందిని చూసిన సిబ్బంది... 108 ద్వారా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందులో ఒక విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆ విద్యార్థినికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉంది.విషయం తెలుసుకున్న గురుకుల పాఠశాల సిబ్బంది, ప్రిన్సిపాల్, వైద్యశాలకు వెళ్లి విద్యార్థినిల పరిస్థితులను గమనించారు. అంతే గాక వీరితో పాటు నంద్యాల ఆర్ఢీవో,తహాశీల్ధార్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థులు ఏమి తిన్నారో తెలుసుకున్నారు. ఐరన్ మాత్రలు వేసుకోని విద్యార్థులకు కూడా పుడ్ పాయిజన్ అయినట్లు విద్యార్థులు చెప్పారు.

ఇలా గురుకుల పాఠశాలలో కస్తూర్బా బాలికల పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే భోజనం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం తరచుగా జరుగుతుండడంతో విద్యార్థినిల తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇటివలాపత్తికొండ సమీపంలోని ఓ పాఠశాలలో సైతం సుమారు 19 మందికి పైగా విద్యార్థులు పాఠశాలలో భోజనం తిని అస్వస్థతకు గురై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అదే విధంగా ఆత్మకూరు మండల సమీపంలోని అంగన్వాడి పాఠశాలలో చిన్నారులకు ఇచ్చేటటువంటి పాల ప్యాకెట్లు కాలం చెల్లినవి సరఫరా చేయడంతో అవి కుళ్లిపోయి దుర్వాసన రావడంతో ముందుగానే పసిగట్టిన అంగన్వాడీ కేంద్రంలోని ఆయాలు వాటిని పడేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్టల్లో విద్యార్థులకు వండించే ఆహారం నాణ్యత లేకపోవడం కాలం చెల్లినది పెట్టడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూ వస్తున్నారు.

ఇలాంటి ఘటన జరిగిన సమయంలో మాత్రమే అధికారులు కొంతవరకు హడావిడి చేసి వదిలేస్తున్నారే తప్ప అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్ధం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసి విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలను నాణ్యతను పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు