హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Balayya: ఇదీ బాలయ్య అంటే.. స్వయంగా ఫోన్ చేసి అభిమాని ఫ్యామిలికీ సర్ ప్రైజ్.. ముద్దులు కురిపిస్తున్న మహిళలు

Balayya: ఇదీ బాలయ్య అంటే.. స్వయంగా ఫోన్ చేసి అభిమాని ఫ్యామిలికీ సర్ ప్రైజ్.. ముద్దులు కురిపిస్తున్న మహిళలు

అభిమాన కుటుంబానికి బాలయ్య సర్ ప్రైజ్

అభిమాన కుటుంబానికి బాలయ్య సర్ ప్రైజ్

Balayya: తన ఫ్యాక్షన్ సినిమాలకు అడ్డా అయిన కర్నూలు గడ్డపై బాలయ్య సందడి కొనసాగుతోంది. ఇది మా బాలయ్య అంటూ అభిమానులు హోరెత్తిస్తున్నారు. స్వయంగా బాలయ్య ఫోన్ చేసి.. అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేసి పెద్ద మనసుల చాటుకున్నారు. మరోవైపు బాలయ్యను చూసిన అందరూ విజిల్స్ వేస్తూ ముద్దులు కురుపిస్తున్నారు. మహిళా అభిమానులు కూడా భారీ సంఖ్యలోనే సందడి చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Balayya: నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandmuri Balakrishna) అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. అంతే ప్రేమ కూడా చూపిస్తారని టాక్.. మరోసారి తన అభిమానాన్ని బాలయ్య చాటుకున్నారు. కర్నూలు (Kurnool) లో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య.. తాజాగా చేసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూలులో శరవేగంగా జరుగుతంది. ప్రస్తుతం కర్నూలు సిటీలోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సోమవారం చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను కొండా రెడ్డి బురుజు, మరియు ఇతర లొకేషన్లలో చిత్రీకరించారు. అయితే ఈ సందర్భంగా బాలయ్య చేసిన పని అందర్నీ ఆకట్టుకుంది. గతంలో ఆయన ఓ అభిమానిని కలుస్తానని మాటిచ్చారు. అయితే ఇలా సినిమా హీరోలు చాలామందికి మాట ఇవ్వడం చాలా కామన్.. ఎవరైనా కలిసినప్పుడు మొహమాటానికి సరే కలుస్తామని తలూపుతారు.. కానీ బాలయ్య మాత్రం అలా ఇచ్చిన మాట గుర్తు పెట్టుకున్నారు.

  ప్రస్తుతం కార్నూలులో ఉన్న ఆయన.. ఆ విషయం గుర్తు పెట్టుకుని.. అభిమానికి స్వయంగా ఫోన్ చేసి పిలిచారు.. కేవలం పిలిచి వారిని పలకరించడమే కాదు.. ఆ కుటుంబంతో కలిసి భోజనం చేశారు బాలయ్య. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో ఇది మా బాలయ్య అంటూ సోషల్ మీడియాలోఆయన అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు.

  బాలయ్య షూటింగ్ జరుగుతోందని తెలియడంతో భారీగా అభిమానులు ఆయా స్పాట్లలో గుమిగూడుతున్నారు. మహిళా అభిమానులు సైతం విజిల్స్ వేస్తూ.. ముద్దులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

  మరోవైపు బాలయ్య సినిమా షూటింగ్‌ ని చూసేందుకు, నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో సెట్ కి తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య వారిని పలకరించారు. తరువాత తన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌ తో మాట్లాడి.. తన అభిమానులందరికీ భోజనం పెట్టించారు. 

  అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) క్రేజీ కాంబినేషన్ లో బాలకృష్ణ కథానాయకుడిగా సినిమా చేస్తున్నారు. బాలయ్య 107వ (NBK107) చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో ఆయన పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తేలిపోయింది. బాలయ్య భిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

  ఇదీ చదవండి : తిరుమల శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ.. అనూహ్యంగా తగ్గిన రద్దీ.. కారణం ఇదే?

  ఇప్పటికే హైదరాబాద్ (Hyderabad) లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కొద్ది రోజులుగా కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. అలంపూర్.. యాగంటి.. కొమ్మ చెరువు ప్రాంతం పూడిచర్ల.. ఓర్వకల్లు.. పంచలింగాల.. మరిన్ని ప్రదేశాల్లో బాలయ్య సహా ప్రధాన తారాగణంపై కీలక ససన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో బాలయ్యతో పాటు శృతి, దునియా విజయ్ కూడా పాల్గొంటున్నారు. అయితే అక్కడ బాలయ్య అభిమానులుతో ప్రవర్తించిన తీరు చూసి.. ఆయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు