హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Srisailam: శివరాత్రి బ్రహోత్సవాలకు శ్రీశైలం వెళ్లే శివభక్తులకు శుభవార్త..

Srisailam: శివరాత్రి బ్రహోత్సవాలకు శ్రీశైలం వెళ్లే శివభక్తులకు శుభవార్త..

శ్రీశైల మల్లిఖార్జునస్వామి ఆలయం

శ్రీశైల మల్లిఖార్జునస్వామి ఆలయం

Srisailam:  ఈ నెల 11వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవనుండగా.. ఫిబ్రవరి 15 వరకు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు నిర్ణీత సమయాల్లో ఉచితంగా స్పర్శ దర్శనాలు కల్పిస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మన దేశంలో హిందువులు జరుపుకునే అతిపెద్ద పండగల్లో శివరాత్రి కూడా ఒకటి. ఆ రోజు భక్తులు ఉపవాసాలు ఉండి.. శివాలయాన్ని దర్శించుకుంటారు. రాత్రంతా జాగారం చేస్తారు. శివరాత్రి (Shiv Ratri 2023) రోజు దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శివాలయమైన శ్రీశైలం (Sri Bhramaramba Mallikarjuna Swamy Temple) లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివ మాల విరమణకు వచ్చి స్వాములు, ఇతర భక్తులతో శ్రీశైల క్షేత్రం (Srisailam) ప్రత్యేక కళను సంతరించుకుంటుంది. శివరాత్రి సందర్భంగా.. ఈసారి ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో.. ఆలయ దర్శన విధానాల్లో కీలక మార్పులు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు.

Tirumala: ఆటోమేటిక్ యంత్రాలతో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ.. ఏకంగా రూ.50 కోట్లు.!

 ఈ నెల 11వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవనుండగా.. ఫిబ్రవరి 15 వరకు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు నిర్ణీత సమయాల్లో ఉచితంగా స్పర్శ దర్శనాలు కల్పిస్తారు. మధ్యాహ్నం సమయంలో జరుగుతున్న ఉచిత దర్శనాలను సైతం బ్రహ్మోత్సవాల ముందు రోజు వరకు మాత్రమే అనుమతించనున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. శివదీక్షా స్వాములకు చంద్రావతి కల్యాణ మండపంలో, శివదీక్షా శిబిరాల వద్ద నిత్యాన్నదానంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

శ్రీశైలంలో శివరాత్రి బ్రహోత్సవాల నేపథ్యంలో.. శివయ్య భక్తులకు అటవీశాఖ కొంత వెసులుబాటు కల్పించింది. భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలి రానున్న నేపథ్యంలో.. అభయారణ్యంలో రాత్రిళ్లు సైతం వాహనాల రాపోపోకలకు అనుమతి ఇచ్చింది. ఐతే అందుకు కొన్ని షరతులను విధించింది. వాహనాలలో శ్రీశైలం వచ్చే భక్తుల 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. అభయారణ్యంలో ఎక్కడా కూడా వాహనాలను నిలుపకూడదు. దేవదాయ, అటవీ అధికారులు కేటాయించిన సిబ్బంది పర్యవేక్షణలో పయనించాల్సి ఉంటుంది. శివరాత్రి బ్రహోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం శ్రీశైలంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News

ఉత్తమ కథలు