హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Srisailam: ప్రమాదాలకు నిలయంగా మారిన శ్రీశైలం ఘాట్ రోడ్లు..!

Srisailam: ప్రమాదాలకు నిలయంగా మారిన శ్రీశైలం ఘాట్ రోడ్లు..!

X
ప్రతీకాత్మక

ప్రతీకాత్మక చిత్రం

టీఎస్ ఆర్టీసి బస్సు లోయకు ఆనుకుని ఉన్న డివైడర్ ను ఢీకొట్టి ఆగిపోయింది ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు .

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

ప్రమాదాలకు నిలయంగా మారిన శ్రీశైలం ఘాట్ రోడ్లు ఘాట్రోడ్లో ప్రయాణించాలంటే వనికి పోతున్న జనం. ఎప్పుడు ఏ మలుపులో ఏం జరుగుతుందోనంటూ బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్న భక్తులు. ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ వెలుతున్న టిఎస్ ఆర్ టీసి బస్సు అదుపుతప్పి డ్యాం సమీపంలోని లోయకు పక్కనే ఉన్న డివవైడర్ ను ఢీ కొట్టింది.ఘాట్ రోడ్డు కావడం పెద్ద పెద్ద మలుపులు ఉండటంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు.ఎత్తైన లోయకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సైడ్ డివైడర్ ను ఏర్పాటు చేశారు .

శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ వెలుతున్న టీఎస్ ఆర్టీసి బస్సు లోయకు ఆనుకుని ఉన్న డివైడర్ ను ఢీకొట్టి ఆగిపోయింది ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు బస్సులో 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అయితే అదృష్టం బాగుండి మహబూబ్‌నగర్ కు చెందిన ఆర్టీసి బస్సు డివైడర్ ను ఢీకొట్టి లోయలో పడకుండా ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు బస్సులో నుంచి ప్రయాణికులు హుటాహుటిన బయటకు దిగారు.

ఆర్టీసి బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును రివర్స్ గేరులో వెనుకకు తీసి ప్రయాణికులు దైర్ఘ్యం చెప్పి తిరిగి బస్సులోనికి ప్రయాణికులను ఎక్కించుకుని మహబూబ్‌నగర్ కు బస్సు బయలుదేరి వెల్లింది అయితే ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాలు నెమ్మదిగా ప్రయాణిస్తు వుంటాయి ఘాట్ రోడ్డులో పైన నుంచి వాహనాలు రావడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ ను డీకొట్టి ఆగిపోయింది. అదృష్టం శాత్తు ప్రయాణికులకు ఎవరికి ఏమికాలేదు ఘాట్ రోడ్డులో పెను ప్రమాదమే తప్పింది.

First published:

Tags: Kurnool, Local News

ఉత్తమ కథలు