హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: శ్రీశైల జగద్గురు పీఠాధిపతి మహా పాదయాత్ర..

Kurnool: శ్రీశైల జగద్గురు పీఠాధిపతి మహా పాదయాత్ర..

X
పాదయాత్ర

పాదయాత్ర చేపట్టిన శ్రీశైలం జగద్గురువులు

Kurnool: దేశంలో ఉన్న యువత చెడు వ్యసనాలకు దూరం కావాలని సంకల్పిస్తూ శ్రీ శైలం పీఠాధిపతి చిన్న సిద్ధా రామా పండితారాధ్య శివస్వాముల వారు మహా పాదయాత్ర ప్రారంభించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

దేశంలో ఉన్న యువత చెడు వ్యసనాలకు దూరం కావాలని సంకల్పిస్తూ శ్రీ శైలం పీఠాధిపతి చిన్న సిద్ధా రామా పండితారాధ్య శివస్వాముల వారు మహా పాదయాత్ర ప్రారంభించారు. కర్ణాటకలోని బెలగౌ జిల్లా ఎడ్యుర్ నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు సుమారు 650 కిలోమీటర్లు దూరం వరకు సాగె ఈ పాదయాత్రలో భాగంగా కర్నూలు పట్టణంలోకి ప్రవేశించిన స్వామి వారి పాదయాత్రకు ప్రజలు బ్రాహ్మరథంతో స్వాగతం పలికారు. వేద మంత్రాలతోఅశేషా జనసంద్రోహం మధ్య సాగింది...

శ్రీ శైలం పీఠాధిపతి చిన్న సిద్ధా రామా పండితారాధ్య శివస్వాముల వారు మాట్లాడుతూ...శ్రీ శైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను భక్తులు చాలా పవిత్రంగా కొలుస్తారు.కొలిచినా వారి కోరికలు తీర్చేవారిగి... భక్తులకొంగుబంగారుంగాశ్రీ శైలం పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందిందని తెలిపారు.

ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రానికి భక్తులు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా... పాద యాత్రగా స్వామి వారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు రావడం అనేది స్వామి వారి యొక్క మహిమ అని తెలిపారు.కోరిన కోరికలు తీర్చే స్వామి శ్రీ శైలం మల్లికార్జున స్వామి భారతదేశంలో ఉన్నటువంటి మహిమాణిత అష్టదశ శక్తీ పీఠాలలో 5వ శక్తీ పీఠం అంతటి మహిమాన్విత శక్తిపీఠం జిల్లాలోని శ్రీశైలంలో ఉండటం ప్రజలు అదృష్టంగా భావించాలని తెలిపారు.

Rahul Gandhi: మహిళా ఎమ్మెల్యేకు ముద్దుపెట్టిన రాహుల్ గాంధీ.. బీజేపీ సెటైర్లు.. కాంగ్రెస్ స్ట్రాంగ్ రియాక్షన్

ఈ పాదయాత్ర యొక్క ముఖ్య సంకల్పం

1. దేశంలోని యువత చెడు వ్యసనాలకు దూరం కావాలని

2. దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు గోమాత యొక్క సేంద్రియ ఎరువుల ద్వారానే పంటలు పండించాలని.

3. వృక్ష సంపదను కాపాడే విధంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు సంకల్పించాలన్నారు.

4.ప్రపంచానికి శ్రీశైలం క్షేత్రం శివదీక్ష యొక్క మహిమ వీరశైవ యొక్క మహత్యాలను తెలియజేయాలన్న సంకల్పంతో ఈ యాత్రను సుమారు 650 కిలోమీటర్ల మేర శ్రీశైలం చేరేవరకు కొనసాగిస్తామనితెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు