Murali Krishna, News18, Kurnool
నేటితరం యువతకు ఆదర్శం మాస్టర్ అథ్లెట్స్.యువతతో పాటు క్రిడలో పోటీ పడడంలో తామేమి తక్కువ కాదుంటూ ఉత్సాహంగా అథ్లెట్స్ క్రీడల్లో పాల్గొన్నారు వృద్దులు. కర్నూలు నగరంలో జరిగిన ఎంపిక పోటిల్లో పాల్గొన్న 40 నుండి వందేళ్ల వయసు గల వృద్దులు. కేవలం ఉద్యోగాలు చేస్తూ జీవితం గడపడమే కాదు మనిషి మానసిక ఆరోగ్యం ఉల్లాసంగా ఉండాలి అంటే ప్రతిఒక్కరు క్రీడల్లో పాల్గొనాలంటున్నారు. నేటితరం యువ క్రీడాకారులకు ఆదర్శంగా మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు నిలవడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆదర్శ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు తిమ్మయ్య అన్నారు.ఆదివారం కర్నూలు (Kurnool) నగరంలోని స్థానిక ఆదర్శ విద్యా మందిర్ పాఠశాలలో నిర్వహించిన 41వ జిల్లాస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఈ కార్యక్రమానికి డాక్టర్ హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాలోని వివిధ ఉద్యోగాలు చేస్తున్నటువంటి 40 సంవత్సరాల వయసు వారి నుంచి 100 సంవత్సరాల వయసు గలవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలోపల్గొన్న ఆదర్శ విద్యాసంస్థల అధినేత తిమ్మయ్యమాట్లాడుతూ క్రీడా రంగంలో రాణించాలనే గ్రామీణ యువ క్రీడాకారులు మాస్టర్స్ అథ్లెటిక్స్ ను ఆదర్శంగా తీసుకుని నేటి క్రీడాకారులుగా ఎదగాలన్నారు.క్రిడలో గెలుపోటములు సహజం క్రీడా పోటీలో ఓడిపోతే ఎవరు తమ మనస్తైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలని తెలిపారు.
అనంతరం డాక్టర్ హరికిషన్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు.మాజీ కార్పొరేటర్ సురేంద్ర మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ ఆర్థిక సౌజన్యంతో ప్రతి ఏడాది క్రీడా పోటీలను ఈ సంవత్సరం కూడా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు టీజీ వెంకటేష్ ఆర్థిక చేయుతనను అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్త్రీ, పురుషులు 186 మంది ఎంపిక పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేంద్ర,మాస్టర్ అథ్లెటిక్స్ సంగం అధ్యక్షులు పాండురంగారెడ్డి, కార్యదర్శి రవికుమార్ (వాసు), వ్యాయామ అధ్యాపకులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News