Vardhan Bank Scam: వర్ధన్ బ్యాంక్ స్కామ్ లో సంచలన నిజాలు.., రాజకీయ హస్తం నిజమేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కర్నూలు జిల్లాలో (Kurnool District)బ్యాంక్ పేరుతో జరిగిన సంఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది.

 • Share this:
  GT Hemanth Kumar, Tirupathi, News18

  ప్రపంచంలో నిత్యసవరమైనవి డబ్బులే. మనం ఏది కొనుగోలు చేయాలన్న.... ఏమికావాలన్న డబ్బులు కావాల్సిందే. నిత్యావసరాల నుంచి మెడికల్ ఎమెర్జెన్సీ వరకు డబ్బులు లేనిదే ఏ పని జరగదు. జులాయి సినిమాలో మాదిరిగా హీరో రూ.10 వేలను గంటలో లక్ష చేస్తా అంటూ ఛాలెంజ్ చేస్తూ క్రికెట్ బెట్టింగులో పట్టుబడిన సందర్భం వేరే అయినా ఆశ అత్యాశ మాత్రం ఒక్కటే. డబ్బులు సంపాదన కోసం అహర్నిశలు కృషి చేసే మిడిల్ క్లాస్ జీవితాలతో కొందరు చెలగాటం ఆడుతున్నారు. అధిక వడ్డీ.., ఒక్క ఏడాదిలో ఇచ్చిన అసలుకన్నా రెట్టింపు ఆదాయం ఇస్తామని నమ్మబలికాడు ఓ మోసగాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లాలో (Kurnool District) బ్యాంక్ పేరుతో జరిగిన కుంభకోణం (Bank Scam) ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది.

  ఆర్ధిక నేరాల్లో దిట్ట...
  కర్నూలు జిల్లా ఏమ్మిగనూరుకి చెందిన మహేశ్వర్ ముందునుంచే నేరాలకు పాల్పడే వాడు. తనకు ఉన్న తెవినంత ఆర్థిక మోసాలకే వినియోగించేవాడు. మహి పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇక రైతలు వద్ద నుంచి వివిధ రకాల స్కీముల పేరిట రూ.14 కోట్లకు టోకరా వేశాడు. ఇక ఓ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహేష్ చాకచక్యంగా కేసు నుంచి తప్పించుకున్నాడు. మహేష్ అనే వ్యక్తి మరణించినట్లు ప్లాస్టిక్ సర్జెరీ చేయిన్చుకొని తాను జాషువాగా అందరికి పరిచయం చేసుకున్నాడు. ఇక ఐటి రంగంలో తనకు ఉన్న పరిజ్ఞానంతో పోలీసుల ఫోన్లు, కంప్యూటర్ లను హ్యాక్ చేసి విచారణ చేసిన వివరాలను తొలగించారు.

  ఇది చదవండి: ఆ కీలక నేతకు ఎమ్మెల్సీ పదవి గ్యారెంటీ..? సీఎం జగన్ మాట నిలబెట్టుకుంటారా..!  అధిక వడ్డీల పేరుతో టోకరా..
  గుంటూరులో మకాం మార్చిన మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలులో చిప్పకూడు తిన్న కూడా మహేష్ లో మాత్రం మార్పురాలేదు. బయటకొచ్చిన మహేష్ ఆత్మకూరులో వర్ధన్ బహుళ రాష్ట్ర సహకార సంస్థ లిమిటెడ్ పేరుతో ఓ బ్యాంకును నెలకొల్పాడు. బ్యాంకు ప్రారంభించిన రెండు మూడు నెలల్లోనే వందల మంది ఖాతాదారులను ఆకర్షించాడు. డిపాజిట్లు, రాయితీల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు అయన సొంత బ్యాంకులో జమ చేయించుకున్నాడు. పెట్టిన పెట్టుబడికన్నా అధికంగా డబ్బులు వచ్చేలా చేస్తారని ఆశ చూపాడు. HDFC బ్యాంక్ చెక్కులు ఇచ్చి అందర్నీ నమ్మించాడు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా 50 శాతం రాయితీ వస్తుందని.. మిగిలిన 50 శాతం సొమ్ముతో గేదెలు, ట్రాక్టర్, టూ విల్లర్, కార్లు, ఆటోలు అందిస్తామని నమ్మించాడు.

  ఇది చదవండి: త్వరలోనే పాపికొండలు టూర్ ప్రారంభం.. ఇలా ప్లాన్ చేసుకోండి.. టికెట్ ధర ఎంతంటే..!  నిందితుడితో పోలీసుల కుమ్మక్కు..?
  ఈ ఘనుడిపై పిర్యాదు ఫిబ్రవరి నెలలోనే ఓ మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. వర్ధన్ బ్యాంకులో 1.50 లక్షలు తీసుకోని మేనేజర్ పోస్టులు ఇస్తామని ఆ మహిళని నమ్మించాడు. బ్యాంకు మేనేజర్ గా విధుల్లో ఉన్న సదరు మహిళా రూ.2.50 కోట్లను డిపాజిట్ చేయించింది. ఆ డబ్బుతో మహేష్ పారిపోయినట్లు ఫిర్యాదు చేసింది. కానీ అప్పుడు విచారణ వేగవంతంగా సాగలేదు. ఈ వ్యవహారంలో పోలీసులు నిందితుడితో చేతులు కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఎనిమిది నెలల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

  ఇది చదవండి: నట్టింట్లో పాతిపెట్టిన నగదు మాయం... పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు..


  రాజకీయ దుమారం..
  ఇప్పుడు రాజకీయ దుమారం రేగడానికి ప్రధాన కారణం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి వర్ధన్ బ్యాంకు ప్రారంభోత్సవానికి పాల్గొనటమే. అంతే కాకుండా అధికార పార్టీ నాయకులు హడావుడి చేయడం ఇప్పుడు రాజకీయ రగడకు తావునిస్తోంది. డిపాజిట్ల సేకరణలోనూ కొందరు అధికార పార్టీ నేతలు సహకరించారట. తీరా బ్యాంక్ డిపాజిటర్లకు కుచ్చు టోపీ పెట్టడంతో.., ఏదో ఒకటి చేసి డబ్బులు ఇప్పిస్తామంటూ బాధితులకు భరోసా ఇస్తున్నారని సమాచారం. మహేష్ కు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయన్న భయంతో చాలా మంది ముందుకురావడం లేదన్న విమర్శలు లేకపోలేదు. నందికొట్కూరు, పాములపాడు, జూపాడుబంగ్లా, కొత్తపల్లి, పగిడ్యాల పరిధిలోనే 150 మంది వరకు బాధితులు ఉన్నట్లు సమాచారం. ఈ ఒక్క నియోజకవర్గ పరిధిలో రూ.4కోట్ల వరకు బాధితులు నష్టపోయినట్లు సమాచారం. పత్తికొండ, ఎమ్మిగనూరుకు చెందిన బాధితులు ముందుకొచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

  ఇది చదవండి: గ్యాంగ్ వార్ కు దారితీసిన ఫ్రీ ఫైర్ గేమ్.. మధ్యలో పోలీసుల ఎంట్రీ.. తర్వాత ఏం జరిగిందంటే..!  నాకేం సంబంధం లేదు: ఎమ్మెల్యే శిల్పా..
  వర్ధన్ బ్యాంకులో డిపాజిట్లు పెట్టమని తాను ఎవరికి చెప్పలేదన్నారు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. మచ్చలేని శిల్ప రాజకీయ జీవితంపై బురదజల్లే ప్రయత్నం తప్ప మరేమీ కాదని వ్యాఖ్యానించారు. వర్ధన్ బ్యాంకు బ్రాంచిని ఆత్మకూరులో స్థాపించాడని.. ఆయన కూతురు ని మేనేజర్ గా పెట్టాడని చెప్పుకొచ్చారు. ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఆహ్వానించారన్నారు. బాలన్నతో సాన్నిహిత్యం ఉన్న వారు, అతని వ్యక్తిగత పరిచయస్తులు, అతడి మాటలు నమ్మి ఈ బ్యాంకులో డిపాజిట్ చేశారని తెలిపారు. అంతేకాని వర్ధన్ బ్యాంకు డిపాజిట్లతో నాకు ఎంసంబంధం ఉందని ప్రశ్నించారు.

  వర్ధన్ బ్యాంకు పేరుతో ఎస్సీ, ఎస్టీలు, నిరుపేదలను దోచుకున్నారని శ్రీశైలం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి..., చక్రపాణి రెడ్డిపై ఆరోపణలు చేశారు. వర్ధన్ బ్యాంకును శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రారంభించారని, వర్ధన్ బ్యాంకు అంటే శిల్పా బ్యాంకు అన్నట్లే అని బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులున్న బ్యాంకు ఛైర్మన్ మహేష్, వైకాపా నంద్యాల పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలన్న కుమార్తె మేనేజర్ గా ఉన్నారన్నారు. ఆమె ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్నారన్నారు.
  Published by:Purna Chandra
  First published: