‘సైరా’ సినిమాకు వెళ్లిన ఎస్సైలు... షాక్ ఇచ్చిన ఎస్పీ

Sye raa: చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి 1 గంట నుంచే షోలు వేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

news18-telugu
Updated: October 2, 2019, 1:03 PM IST
‘సైరా’ సినిమాకు వెళ్లిన ఎస్సైలు... షాక్ ఇచ్చిన ఎస్పీ
సైరా సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలు
  • Share this:
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’సినిమా ఇవాళ దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే చిరంజీవి అభిమానులంతా అర్థరాత్రి నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. అయితే ఏపీలో కొందరు పోలీసులు కూడా చిరు సినిమా కోసం పడిగాపులు పడ్డారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు వెళ్లారు. వేకువజామున కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్సైలు ‘సైరా’ సినిమాకు వెళ్లారు. అయితే ఆన్ డ్యూటీలో ఉండి సినిమాకు ఎలా వెళ్తారంటూ పై అధికారులు సీరియస్ అయ్యారు. ఎలాంటి సమాచారం లేకుండా సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలపై చర్యలు తీసుకున్నారు. వెంటనే వారిని వీఆర్‌కు బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ ఫకీరప్ప ఆదేశాలు జారీ చేశారు.

చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి 1 గంట నుంచే షోలు వేసుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. .ప్రపంచవ్యాప్తంగా సుమారు 4620 థియేటర్లలో సైరా విడుదలైంది. సైరా విడుదల నేపథ్యంలో.. సినిమా రిజల్ట్ గురించి అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.ట్విట్టర్‌లో ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. చిరు అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు.ఓవర్‌సీస్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటం.. చిరు నటన అద్భుతంగా ఉందన్న ప్రశంసలు వినిపిస్తుండటంతో.. సైరాపై మరింత ఎటెన్షన్ క్రియేట్ అయింది.
Published by: Sulthana Begum Shaik
First published: October 2, 2019, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading