Home /News /andhra-pradesh /

KURNOOL SON KILLED MOTHER FOR ASSETS IN KURNOOL KNL NJ ABH

Kurnool: ఇక్కడున్న బాటిల్ బాటిల్ కో కథ.. ఆ స్టోరీ మూత తీస్తే!..

అక్రమంగా రవాణా చేస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

అక్రమంగా రవాణా చేస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

కర్నూలు జిల్లాలో ఓ కసాయి కొడుకు ఆస్తికోసం కన్నతల్లినే కడతేర్చాడు. కౌతాళం మండలం ఏరిగేరి గ్రామానికి చెందిన బోయ హనుమంతమ్మ, లోహితయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు. ఆస్తికి ఆడపిల్లలకు కూడా రాసిస్తారేమో అనే అనుమానంతో తల్లిని హతమార్చాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    (T.Murali Krishna, News 18, Kurnool)

    కర్నూలు జిల్లాలో ఓ కసాయి కొడుకు ఆస్తికోసం కన్నతల్లినే కడతేర్చాడు. కౌతాళం మండలం ఏరిగేరి గ్రామానికి చెందిన బోయ హనుమంతమ్మ, లోహితయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు. అయితే ఆస్తిని ఆడపిల్లలు ముగ్గురికి కూడా పంచి ఇస్తుందేమో అనే అనుమానంతో కుమారుడు లింగన్న…తన తల్లిపై దాడి చేశాడు.

    పప్పు గుత్తితో విచక్షణారహితంగా తల్లి తలపై దారుణంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న హనుమంతమ్మను గమనించిన బంధువులు… హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



    ఆక్రమంగా గుట్కా రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్‌
    కర్ణాటక నుంచి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను ఆటోలో తీసుకొన్న వ్యక్తిని ఆదోనిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పేటకు చెందిన వీరేష్‌గా గుర్తించారు. స్థానిక సట్ట బజార్ వద్ద వీరేష్‌ను పోలీసులు పట్టుకుని..అతని నుంచి రూ. 1.76 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

    అక్రమంగా రవాణా చేస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం: మంత్రాలయం మండల పరిధిలోని మాదారం చెక్‌పోస్ట్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. దాని విలువ రూ.1 లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. మద్యంతో పాటు కారును కూడా సీజ్ చేసి రాయచోరుకు చెందిన నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

    గడివేముల మండలం కే.బొల్లవరం గ్రామానికి చెందిన యువకుడు ఉపేంద్రకు గురువారం కలవబుగ్గలో వివాహం జరిగింది. ఆ తర్వాత నవదంపతులిద్దరూ గ్రామానికి చేరుకున్నారు. సాయంత్రం నవ దంపతులను ఊరేగింపు కార్యక్రమం కోసం డ్రమ్స్ వాయించే కళాకారులను తీసుకురావడానికి ఉపేంద్ర అన్నయ్య వెళ్లాడు. వాళ్లను తీసుకొస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా… పెద్ద రాముడు పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

    కుక్కను తప్పించవబోయి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఆత్మకూరులో జరిగింది. పట్టణానికి చెందిన షాషావలి(21) తన స్నేహితులతో కలిసి ఓ హోటల్లో భోజనం చేసి వస్తుండగా…. మార్కెట్ యార్డ్ సమీపంలో అడ్డుగా వచ్చిన కుక్కలను తప్పించిబోయాడు. ఈ సమయంలో బైక్ అదుపుతప్పి కిండపడింది. ఈ ఘటనలో షాషావలి తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షాషావలి మృతి చెందాడు.

    Read This; Vizag: సమస్యల్లో ఉన్నారా? ఒక్కసారి సంపత్ వినాయకుడ్ని దర్శించుకోండి..? ఎక్కడో తెలుసా?
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Crime news, Kurnool, Local News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు