హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: కొడుక్కి మంచి చెప్పిన ఓ తండ్రికి దక్కిన బహుమానం.., పట్టుమని 18ఏళ్లు లేవు.. ఎంతపని చేశావురా..!

Kurnool: కొడుక్కి మంచి చెప్పిన ఓ తండ్రికి దక్కిన బహుమానం.., పట్టుమని 18ఏళ్లు లేవు.. ఎంతపని చేశావురా..!

కర్నూలు జిల్లాలో తండ్రిని చంపిన కొడుకు

కర్నూలు జిల్లాలో తండ్రిని చంపిన కొడుకు

చిన్ననాటి నుంచి ఎంతో అపూరంగా పెంచిన కన్నకొడుకే నేడు కసాయిగా మారాడు. కంటికి రెప్పలా కాపాడుతూ ఒకపూట తిని తినక గారాబంగా పెంచిన కన్న కొడుకే ఆ తండ్రికి కాలయముడయ్యాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

    Murali Krishna, News18, Kurnool

    చిన్ననాటి నుంచి ఎంతో అపూరంగా పెంచిన కన్నకొడుకే నేడు కసాయిగా మారాడు. కంటికి రెప్పలా కాపాడుతూ ఒకపూట తిని తినక గారాబంగా పెంచిన కన్న కొడుకే ఆ తండ్రికి కాలయముడయ్యాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ కుమారుడిని... మండలించడమే ఆ తండ్రికి శాపమైంది. మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న కన్న తండ్రినే కొడుకు కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఈ హృదయ విధారక ఘటన జిల్లా వాసులను తీవ్రంగా కలచి వేసింది. కర్నూలు జిల్లా (Kurnool District) కోసిగి మండలంలోని కోసిగి నాల్గవ వార్డులో అల్లమ్మ, వీరయ్య దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. రెక్కడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు సంతానం. ఇందులో పెద్దకుమారుడు నరసింహులు చదువు మానేసి జులయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మద్యంకు బానిస ఆయ్యాడు.

    నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి ఆ మత్తులో తల్లిదండ్రులను వేధించేవాడు. కళ్ళ ముందే కొడుకు ఇలా తాగుడుకు బానిసై జీవితం నాశనం చేసుకుంటున్నాడని ఆ తల్లిదండ్రులిద్దరూ మనోవేదనకు గురయ్యారు. కొడుకుకు బుద్ది చెప్పాలని తండ్రి వీరయ్య కొడుకు నరసింహులను పలుమార్లు మందలించాడు.

    ఇది చదవండి: నగదు తీసుకోవడానికి వేలి ముద్రలు వేస్తున్నారా..? అయితే బీకేర్ ఫుల్.. దీని గురించి తెలుసుకోవాల్సిందే

    ఇలా తరచూ తండ్రి మందలిస్తుండడంతో మద్యం మత్తులో ఉన్న కొడుగు ఎలాగైనా తండ్రిని హతమార్చాలనుకున్నాడు. అర్ధరాత్రి వీరయ్య ఇంట్లో నిద్రిస్తుండగా కొడుకు నర్సింహులు మద్యం మత్తులో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. గొడ్డలితో తండ్రి గొంతుపై నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు.

    ఇది చదవండి: వాటిని కట్టింది ఎందుకు.. అక్కడ జరుగుతున్నదేంటీ..? అధికారులు నిద్రపోతున్నారా..?

    తెల్లవారుజామున రక్తపు మడుగలో పడి ఉన్న వీరయ్యను చూసి భార్య భోరున విలపించింది. నిత్యం తల్లి దండ్రులను వేధిస్తున్న కొడుకును పద్దతి మార్చుకోవాలని సూచించినందుకు కొడుకు సహించలేక తండ్రిని హత్య చేసినట్లు తెలుస్తోంది. తండ్రిని గొడ్డలితో నరికి రక్తపు మరకలతో ఉన్న గొడ్డలి పట్టుకొని వీధుల్లో తిరుగుతూ నరసింహులు గ్రామస్తులను భయ భ్రంతులకు గురి చేశాడు.

    స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడును అదుపులోకి తీసుకున్నారు. నర్సింహులును అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేదోడువాదోడుగా ఉండాల్సిన కొడుకు కసాయిగా కన్నతండ్రినే హత్య చేసిన ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kurnool, Local News

    ఉత్తమ కథలు