హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: పక్కదారి పడుతోన్న రేషన్‌ బియ్యం..! సరిహద్దులు దాటి పక్కరాష్ట్రాలకు అక్రమరవాణా..!

Kurnool: పక్కదారి పడుతోన్న రేషన్‌ బియ్యం..! సరిహద్దులు దాటి పక్కరాష్ట్రాలకు అక్రమరవాణా..!

కర్నూలు జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

కర్నూలు జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. కర్నూలు జిల్లా (Kurnool District) లో రేషన్ బియ్యం (Ration Rice) పక్కదారి పడుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. కర్నూలు జిల్లా (Kurnool District) లో రేషన్ బియ్యం (Ration Rice) పక్కదారి పడుతోంది. ఎమ్మిగనూరు, ఆదోని, పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదోని కర్ణాటక (Karnataka) సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న 50 టన్నుల రేషన్ బియ్యన్ని పోలీసులు పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా అనేక సార్లు ఎంతో మంది పట్టుబడినా.., అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు ఈ బియ్యాన్ని తక్కువ ధరకు పేదల దగ్గర నుంచి కొనుగోలు చేసి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తూ అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

  కర్నూలు జిల్లాకు ప్రతి నెల 18 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. కిలో బియ్యం రూపాయి చొప్పున ఒక్కో లబ్ధిదారుడికి ఐదు కిలోల బియ్యం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం ఒక్కో లబ్ధిదారుడికి ప్రతి నెలా ఐదు కిలోల ప్రకారం ఉచితంగా బియ్యం ఇస్తోంది. ఈ బియ్యాన్ని అక్రమార్కులు పేదల దగ్గర నుంచి తక్కువ ధరలకు కొంటూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

  ఇది చదవండి: కాకినాడలో జైభీమ్‌ సినిమా సీన్‌ రిపీట్‌..! పోలీసులే చేశారా..?

  ప్రభుత్వం పంపిణి చేస్తున్న రేషన్ బియ్యానికి కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండ్‌ ఉండడంతో కొంతమంది ఈ వ్యాపారాన్ని ఎంచుకొని పేదల దగ్గరి బియ్యన్ని కిలో 8 రూపాయల చొప్పున కొంటూ వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి జేబులు నింపుకొంటున్నారు. కొందరు ఏజెంట్లను నియమించుకొని వారిని ఇంటింటికి పంపి రాత్రి వేళల్లో బియ్యం సేకరిస్తున్నారు. వాటిని తర్వాత వాహనాల్లో కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. మరికొందరు మాత్రం ఏకంగా డీలర్ల వద్దకే వెళ్లి నేరుగా కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

  ఇది చదవండి: దసరా వస్తే చాలు అందరి చూపు అటువైపే.. తలలు పగిలి రక్తం కారాల్సిందే..!

  కిలో బియ్యానికి రూ.5 నుంచి రూ.8 వరకు చెల్లిస్తుండగా.. వాటిని కర్ణాటక రాష్ట్రంలో రూ.12 నుంచి రూ.14 వరకు డిమాండు బట్టి విక్రయిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలు కర్ణాటక రాష్టాన్ని ఆనుకుని ఉండటంతో ఈ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కర్నూలు జిల్లా నుంచి భారీగా రేషన్‌ బియ్యం నిత్యం వాహనాలలో తరలిపోతున్నా పూర్తిస్థాయిలో దాడులు కానరావడం లేదు. వీటికి తోడు కొందరు రాజకీయ నాయకుల అండదండలతో అక్రమార్కులు ఆగడలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  ఇలా ఒకటి కాదు రెండు కాదు నిత్యం ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతుంది. ప్రతి రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా సరిహద్దులో ఎక్కడో ఒకచోట పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నప్పటికి అసలైన అక్రమార్కులను మాత్రం పట్టుకోవడంలో విఫలం అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం యథేచ్ఛగా కర్నూలు జిల్లా సరిహద్దులు దాటి కర్ణాటక రాష్ట్రానికి టన్నులు టన్నులలో తరలిస్తున్నారు అక్రమార్కులు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు