Murali Krishna, News18, Kurnool
కర్నూలు జిల్లా (Kurnool District) లో సైబర్ నేరగాళ్లు (Cyber Crimes) రోజురోజుకు మితిమీరి పోతున్నారు. మరోవైపు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువకులను నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ ఒకవైపు డాక్టర్ గా ఉంటూనే మరోవైపు ఎంపీగా రాజకీయాల్లో తన ధైన శైలిలో ప్రత్యేక ముద్రవపవేసుకున్నాడు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా ఎవరిపై ఎలాంటి అసత్య ఆరోపణలు చేయకుండా తనదైన శైలిలో రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు డాక్టర్ గా రాణిస్తూ మరోవైపు ఎంపీగా రాజకీయాల్లో బిజీగా ఉండే సందీప్ కుమార్. తనకు అవసరమయ్యే ఒక సాఫ్ట్ వేర్ తయారు చేసి ఇవ్వాలని ఓ వ్యక్తిని సంప్రదించగా అతను సంజీవ్ కుమార్ కు కుచ్చుటోపీ పెట్టాడు.
గతేడాది ఏప్రిల్ నెలలో డాక్టర్ సంజీవ్ కుమార్ చెందిన శ్రీకాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఫోన్ ద్వారా సంప్రదించి తనకు అవసరమయ్యే ఒక పర్సనల్ సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వాలని అడిగాడు. అందుకు అతను రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలుపగా... ఎంపీ సంజీవ్ కుమార్ అందుకు అంగీకరించి అతనికి రెండు లక్షల రూపాయలు.. సదరు వ్యక్తి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే నెలలు గడుస్తున్నా అతను మాత్రం సాఫ్ట్ వేర్ తయారు చేసి ఇవ్వకపోగా ఫోన్ చేసిన కూడా సరిగ్గా స్పందించకపోవటంతో.. మోసపోయానని గ్రహించిన ఎంపీ సంజీవ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు.
గతంలో కూడా కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సైబర్ నేరగాళ్ళ చేతిలో ఈ తరహాలోనే మోసపోయాడు. తన సెల్ ఫోన్ కి కొంతమంది సైబర్ నేరగాళ్లు ఏదో లింకు పంపించి దానికి సంబంధించిన ఓటిపి చెప్తే నీకు డబ్బులు వస్తాయని ఆశపెట్టారు. దీంతోసంజయ్ కుమార్ ఓటీపీని తెలియచేయటంతో.. ఒక్కసారిగా దిమ్మతిరిగే మెసేజ్ వచ్చింది. తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నట్లు మెసేజ్ రావడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ తరహాలో సైబర్ నెరగాళ్లు రాజకీయ నాయకులనువదలటం లేదు మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News