Home /News /andhra-pradesh /

KURNOOL SHIVA LINGAM SEEN IN A HOUSE PEOPLE PERFORMING PUJA IN KURNOOL DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

AP News: ఇంట్లో ఉద్భవించిన శివలింగం.. పరుగులు పెడుతున్న జనం.. అసలు నిజం ఇదే..!

భక్తులు పూజలు చేస్తున్న శివలింగం

భక్తులు పూజలు చేస్తున్న శివలింగం

వేపచెట్టుకు పాలుకారడం, సాయిబాబా ఫోటో నుంచి విభూది రాలడం, వినాయకుడు పాలు తాగటం లాంటి మరెన్నో అప్పడప్పుడూ చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) లో జరిగింది.

    ప్రపంచంలో ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని భయం కలిగించే అంశాలు కూడా ఉంటాయి. మనం ఊహించిన దానికంటే అనుకోని అనుభవాలే ఎక్కువగా ఎదురవుతుంటాయి. వేపచెట్టుకు పాలుకారడం, సాయిబాబా ఫోటో నుంచి విభూది రాలడం, వినాయకుడు పాలు తాగటం లాంటి మరెన్నో అప్పడప్పుడూ చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) లో జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలోని ఓ ఇంట్లో వింత ఘటన చోటు చేసుకుంది. నాగలక్ష్మి అనే మహిళ ఇంట్లో నాపరాయి నుంచి శివలింగం ఉద్భవించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సాక్షాత్తూ ఆ మాహశివుడే లింగం రూపంలో ఇంట్లో వెలిశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

    ఈ మాట ఆటనోట ఈనోట చుట్టుపక్కలవారికి తెలియడంతో శివలింగాన్ని దర్శించుకునేందుకు పరుగులు పెడుతున్నారు. దేవుడే తమ ఇంటికి వచ్చాడంటూ నాగలక్ష్మి అక్కడ పూజలు చేస్తున్నారు. అక్కడ జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా వెళ్లాల్సి వచ్చింది.

    ఇది చదవండి: ప్రశాంత్ నీల్ మన తెలుగోడే..! ఏపీ మాజీ మంత్రికి రిలేషన్ కూడా.. నీల్ అంటే అర్ధం ఇదే..!


    గతంలో చిత్తూరు జిల్లా (Chittoor District) లో ఇలాంటి ఘటనే జరిగింది. బండకాడపల్లికి చెందిన మురళి అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు నిద్రలో నుంచి మేల్కొన్నారు. ఎలాంటి అలికిడి లేకోవడంతో భావించి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. కానీ ఆ శబ్దాలు రానురాను ఎక్కువకావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేఛారు. ఇల్లంతా గమనించగా వడ్ల మూట నుంచి శబ్దాలు రావడం గమనించారు.

    ఇది చదవండి: మునిగిపోయిందనుకొని నీళ్లలో గాలిస్తుంటే.. కూల్ గా బస్సుదిగింది.. గ్రామస్తుల ముఖచిత్రాలు ఇలా..!


    వెంటనే ఆ మూటను తెరిచి చూసిన మురళి అతడి కుటుంబ సభ్యులకు నోట మాట రాలేదు. ఆ మూటలో అమ్మవారి పంచలోహ విగ్రహం ఉంది. దీంతో వారికి ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది. వెంటనే అమ్మవారి విగ్రహాన్ని బయటకుతీసి పూజలు చేయడం మొదలుపెట్టారు. తెల్లారేసరికి విషయం ఆ నోటా.. ఈనోటా ఊరంతా తెలియడంతో జనం తండోపతండాలుగా అక్కడికి తరలివస్తున్నారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో తనను ఎవరో పిలిచినట్లు అనిపించడంతో నిద్రలేచానని.. నేను వడ్ల మూటలో ఉన్నాను వచ్చి పూజలు చేయమని అమ్మవారు చెప్పిందని.. వెంటనే వెళ్లి చూస్తే అక్కడే ఉందని మురళీ చెప్పాడు. అప్పటి నుంచి అమ్మవారిని పూజిస్తున్నామన్నారు. తామే అమ్మకు అన్ని జరిపిస్తామని వెల్లడించారు. నందవరంలో నిజంగానే శివలింగం ఉద్భవించిందా.. లేక నాపరాయి అరిగిపోయి శివలింగంలా ఏర్పడటంతో జనం అలా భావిస్తున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kurnool

    తదుపరి వార్తలు