T. Murali Krishna, News18, Kurnool
దేశంలో అమ్మాయిలపై ఆఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఆఫీసుల్లోనూ, పాఠశాలల్లోనూ ఏదో ఒకచోట ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్లోని ఓ స్కూల్లో 4వ తరగతి చదివే చిన్నారిపై డ్రైవర్ ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై అటు తెలంగాణలోనే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో జరిగాయి. అది మరవక ముందే కర్నూలులో ఓవిద్యార్థిపై అకౌంటెంట్ అసభ్యకరంగా ప్రవర్తించాడాన్ని పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది.
ఇలా వరుసగా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగడం అందులోనూ పాఠశాలల్లో ఇలాంటివి జరగడం తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూల్ పట్టణంలోని ఓ పాఠశాలలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాకు వివరాలను వెల్లడించారు. కర్నూల్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఫీజు కట్టేందుకు వెళ్లినప్పుడుఅకౌంటెంట్మద్దిలేటి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఈ విషయం బయటికి చెప్తే పరిస్థితి వేరేలా ఉంటుందని బెదిరించాడు. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం కొద్ది రోజులపాటు అతనిని విధుల్లో నుంచి తీసేసింది. మళ్లీ రెండు రోజుల తర్వాత అతను పాఠశాలకు వచ్చి అమ్మాయిని బెదిరించడంతో బాధితురాలు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా వారు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో. మనకేం సంబంధం లేదు అంటూ బాధితురాలి తల్లిదండ్రులతో చెప్పడంతో వారు కర్నూలు మూడవ పట్టణ పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ముద్దాయి పైన అలాగే విషయాన్ని దాచిపెట్టిన అటువంటి స్కూల్ యజమాన్యం పైన పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కర్నూలు మూడవ పట్టణ సీఐ తబ్రేజ్ తెలిపారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తమ పోలీసులు విద్యార్థినిలకు ఇలాంటివి జరిగితే వెంటనే పోలీసులకు తెలిపే విధంగా వివిధ రకాలుగా అవగాహన సదస్సులో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Kurnool