హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా ...10 మందికి తీవ్రగాయాలు

Kurnool: అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా ...10 మందికి తీవ్రగాయాలు

X
రోడ్డు

రోడ్డు ప్రమాద ఘటన

Andhra Pradesh: నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని రోడ్డు ప్రమాదం జరిగింది.జూటూరు రుద్రవరం గ్రామాల మధ్యఉన్న ఊట వాగు సమీపాన ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(T. Murali Krishna, News18, Kurnool)

నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని రోడ్డు ప్రమాదం జరిగింది. జూటూరు రుద్రవరం గ్రామాల మధ్య ఉన్న ఊట వాగు సమీపాన ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూల్ నుండి కాకినాడ వెళ్తున్న కాకినాడ డిపో కు చెందిన సూపర్ లగ్జరీ AP52. 5094 బస్సు పాములపాడు మండల జూటూరు గ్రామం చేరుకోగానే ... ముందుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేకులు వేయడంతో,  లారీ వెనక వస్తున్న సూపర్ లగ్జరీ ఆర్టిసీబస్సుకుబ్రేకులు పడకపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

ఆ సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉండగా. వారిలో 10 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే గ్రామ సమీపంలోని గ్రామస్తులంతా ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులంతా బస్సులో ఇరుక్కుపోయిన వారినంత బస్సు వెనుక భాగంలో ఉన్నటువంటి అద్దాన్ని పగలగొట్టి అందులో ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు పోలీసులు కలిసి వెంటనే 108 వాహనం ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మిగిలిన ప్రయాణికులను అంత వేరే బస్సు ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పాములపాడు మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.  కాగా, బస్సు ముందు వెళ్తున్న లారీ సడన్ గా బ్రేకులు వేయడంతో వెనకాలే వస్తున్న బస్సు బ్రేక్సు పడలేదు. దీంతో బస్సు అదుపు చేయలేక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News, Road accident

ఉత్తమ కథలు