హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: ప్రేమ పేరుతో యువతిని గర్భవతి చేసిన ఆర్ఎంపీ డాక్టర్

Kurnool: ప్రేమ పేరుతో యువతిని గర్భవతి చేసిన ఆర్ఎంపీ డాక్టర్

ప్రేమపేరుతో మోసం

ప్రేమపేరుతో మోసం

Andhra Pradesh: నంద్యాల జిల్లా సంజామల మండలం అల్వకొండ గ్రామంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్న గుండా రాజేష్ ఓ యువతికి మాయ మాటలు చెప్పి గర్భవతిని చేశాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

రిపోర్టర్ : మురళి

లొకేషన్ : కర్నూల్

నంద్యాల జిల్లా సంజామల మండలం అల్వకొండ గ్రామంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్న గుండా రాజేష్ ఓ యువతికి మాయ మాటలు చెప్పి గర్భవతిని చేశాడు. యువతి గర్భవతి విషయం ఆమె ఇంట్లో తెలిస్తే సమస్య పెద్దది అవుతుందన్న ఉద్దేశంతో రహస్యంగా ఆ యువతికి అబార్షన్ మందులు ఇచ్చాడు. గర్భస్రావం ప్రక్రియ వికటించి ఆ యువతి తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయింది. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో గమనించిన బంధువులు ఆ యువతని హుటాహుటిన నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై యువతి ఫిర్యాదు మేరకు ఆర్ఎంపి రాజేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంజామల మండలం అల్వకొండ గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లల తండ్రి అయిన వివాహితుడు రాజేష్. ఆల్వకొండ గ్రామంలో క్లినిక్ ఏర్పాటు చేసుకుని ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నారు. రాజేష్ క్లినిక్ కు సమీపంలోనే ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. పొదుపు లక్ష్మి సంఘంలో బుక్కు కీపర్ గా పనిచేస్తోంది. వీరి ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆ యువతిని ఆర్ఎంపి రాజేష్ లోబరుచుకుని శారీరకంగా వాడుకున్నాడు. గత మూడు సంవత్సరాలుగా ఈ తంతు సాగింది. అయితే ఇటీవల ఆ యువతికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం ఆరంభించారు. వచ్చిన పెళ్లి సంబంధాలు అన్నిటిని ఆర్ఎంపీ డాక్టర్ చెడగొట్టేవాడు. ఇంతలోనే ఆ యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని అడగగా పెళ్లికి నిరాకరించాడు.

తన సొంత వైద్యం ఉపయోగించి యువతికి గర్భస్రావం మందులు ఇచ్చాడు. అయితే గర్భస్రావం ప్రక్రియ వికటించడంతో అధిక రక్తస్రావం అవుతూ యువతి స్పృహ తప్పి పడిపోవడంతో యువతి బంధువులు ఆమెను నంద్యాల లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ యువతిని పరీక్షించిన వైద్యులు యువతి గర్భం దాల్చగా.. ఆర్ఎంపి చేసిన గర్భస్రావ పక్రియ వికటించిందని తెలిపారు. ప్రైవేటు విద్యాశాల వైద్యులు ఆ యువతికి గర్భస్రావం చేసి ఆమెను ఇంటికి పంపించారు. ప్రేమ పేరుతో గర్భవతిని చేసి గర్భస్రావం చేసి వదిలించుకునేందుకు యత్నించిన రాజేష్ పై జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆర్ఎంపీ డాక్టర్ రాజేష్ పై కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు