హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: కాలజ్ఞానం చెప్పిన కుటుంబంలో ఆధిపత్య పోరు... పీఠాధిపతి ఎవరో బ్రహ్మయ్యకే ఎరుక

Andhra Pradesh: కాలజ్ఞానం చెప్పిన కుటుంబంలో ఆధిపత్య పోరు... పీఠాధిపతి ఎవరో బ్రహ్మయ్యకే ఎరుక

ఇన్నాళ్లూ పీఠాధిపతిగా ఉన్న వీరభోగ వంసత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలుండటంతో వివాదం మొదలైంది.

ఇన్నాళ్లూ పీఠాధిపతిగా ఉన్న వీరభోగ వంసత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలుండటంతో వివాదం మొదలైంది.

ఇన్నాళ్లూ పీఠాధిపతిగా ఉన్న వీరభోగ వంసత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలుండటంతో వివాదం మొదలైంది.

  GT Hemanth Kumar, Tirupathi Correspondent, News18

  శ్రీ మద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అయన చెప్పిన కాలజ్ఞానం రోజు రోజుకు ఒక్కో వింతగా జరుగుతోంది. అయన చెప్పిన కోరంకి వ్యాధి కరోనా రూపంలో వచ్చి కోడి తూగినట్లు తూగి మనుషులు మృత్యువాత పడుతున్నారు. ఎటుచూసినా దేశమంతా కరోనా భయంతో విలవిలలాడుతుంటే.., అయన మఠంలో మాత్రం ఆధిపత్య పోరు కొనసాగుతోంధి. కడప జిల్లాలోని కందిమల్లాయపల్లె గ్రామంలో వీర బ్రహ్మేంద్ర స్వామి చివరి సారిగా కాలజ్ఞానాన్ని బోధించి జీవ సమాధి అయ్యారు. అయన జీవ సమాధి అయినా ప్రాంతం లో దేవాలయం నిర్మించి మఠంను ఏర్పాటు చేశారు. మఠంగా ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు బ్రహ్మంగారి మఠానికి మఠాధిపతులుగా వారి కుటుంబ సభ్యులే ఉంటూ వస్తున్నారు. ప్రస్తుత పీఠాధిపతిగా కొనసాగుతున్న వీరభోగవసంత వెంకటేశ్వర స్వామి పరమపదించారు. దీంతో మఠాధిపతి పీఠం కాలికావడంతో పీఠం దక్కించుకోవడానికి వారసుల మధ్య పోటీ నెలకొంది.

  ఏడు తరాలుగా మఠాధిపతులుగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వారసులు పీఠాధి పతులుగా ఎలాంటి వివాదం లేకుండా ఎంపికయ్యారు. కానీ ఈ సారి మాత్రం చరిత్రకు బిన్నంగా మఠాధిపతి వివాదం చెలరేగింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతికి ఎనిమిది మంది సంతానం అందులో నలుగురు కుమారులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. అనారోగ్య కారణంతో మొదటి భార్య చనిపోవడంతో మారుతీ మహాలక్షమ్మను రెండవ వివాహం చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు కుమారులు. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి తన మరణం అనంతరం ఎవరు పీఠాధిపతిగా ఉండాలనే వీలునామానే ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీసింది.

  మొదటి భార్య సంతానంలో రెండవ కుమారుడు, రెండవ భార్య రెండవ కుమారుడు పేరును వీలునామాలో రాయడంతో వెంకటేశ్వర స్వామి మరణం అనంతరం వివాదం తలెత్తిది. ఇదే అంశంపై విచారణ చేపట్టారు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రాణాప్రతాప్ విచారణ చేపట్టారు. విచారణకు బ్రహ్మంగారి మఠానికి వెళ్లిన రాణాప్రతాప్ ముందే కుటుంబ సభ్యులు నేనంటే నేనంటూ వాదనలకు దిగారు. దీంతో విచారణకు వెళ్లిన రాణాప్రతాప్ మధ్యలోనే విచారణ వాయిదా వేశారు.

  పెద్ద భార్య మొదటి కుమారుడు వేంకటాద్రి స్వామీకే పీఠాధిపతిగా పట్టం కట్టాలని గ్రామస్థుల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇంటికి పెద్ద కుమారుడు కావడంతో ఈ వాదనకు బలం చేరుకుతోంది. వీలునామాలో మాత్రం మొదటి భార్య రెండవ కుమారుడు పేరు ఉండటం గమర్హం. వెంకటేశ్వర స్వామి మొదటి భార్య చంద్రావతి కిడ్నీలు పాడై ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ సమయంలో ఆమెకు కిడ్నీలు దానం చేసిన వారికే పీఠాధిపతి హోదా వస్తుందని వెంకటేశ్వర స్వామి మాటిచ్చాడు. అప్పట్లో రెండవ కుమారుడు ముందుకు వచ్చి కిడ్నీలను దానం చేశాడు. మాట ఇచ్చినట్లుగానే మొదటి భార్య రెండవ కొడుకు పేరును వీలునామాలో చేర్చారు. దీంతో ఆయనకు మరి కొందరు మద్దతు పలుకుతున్నారు.

  రెండవ భార్య మారుతీ మహాలక్షమ్మ తానె పీఠాధిపతిగా ఉంటానని బిస్మించుకు కూర్చుకున్నారు. తన కుమారుడికి కూడా పీఠాధిపతి ఇవ్వాలనే ప్రతిపాదన వీలునామాలో ఉందని....తన కుమారుడికి చిన్న వయస్సు ఉండటంతో.... ఆ పీఠాన్ని తానే అధిరోహిస్తాని చెప్తున్నారు. అందరి వాదోపవాదాలు విన్న దేవాదాయ శాఖా డిప్యూటీ కమిషనర్ రాణాప్రతాప్ ఇప్పట్లో తేలే అంశం కాదని నిర్ధారణకు వచ్చి.... ప్రాధమిక విచారణ వాయిదా వేసి వెళ్లిపోయారు.

  కాలజ్ఞాన బోధకులు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకు మఠాధిపతి కావాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మఠాధిపతి కావాలంటే తాను కచ్చితంగా హిందూమతం, వేదాంత శాస్త్రాల్లో పట్టు ఉండాలి. అవన్నీ అలవోకగా బోధించే విధంగా ఉండాలి. ధార్మిక గ్రంధాల్లో, మఠానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానం మెండుగా ఉండాలి. మఠంలో శిస్యులుగా ఉన్నవారికి జ్ఞానబోధ, హిందూ సంప్రదాయాలను నేర్పించే సామర్ధ్యం సమర్ధత ఉండాలి. నమ్మకంతో మత ప్రవృతి కలిగి ఉండే నలుగురు పేర్లను ప్రతిపాదించి తదుపరి దేవాదాయ శాఖ కమిషనర్ తో పాటుగా ధార్మిక పరిషత్ 90 రోజుల్లో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.

  First published:

  Tags: Andhra Pradesh, Kurnool

  ఉత్తమ కథలు