(T. Murali Krishna, News18, Kurnool)
కర్నూలు జిల్లాలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మొదటగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేపట్టారు. అనంతరం పోలీసుల కవర్త నిర్వహించి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు ప్రసంగిస్తూ స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు అయినటువంటి సర్దార్ నాగప్ప కర్నూలు జిల్లా వాస్తవ్యులు కావడం జిల్లా అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు.
అలాగే కర్నూలు జిల్లా నుంచి ఎందరో స్వాతంత్ర సమర యోధులు కర్నూలు జిల్లా వారి కావటం విశేషం అన్నారు. యువత స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగి భారతదేశానికి గర్వకారణంగా నిలవాలని ఆ స్థాయిలో యువత మెలగాలని తెలిపారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న నవరత్నాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా పేదలందరికీ ఎంతో లభ్య చేపడుతుందని తెలిపారు. విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వం ముందడుగు వేసి బడుగు బలహీన వర్గాలు అత్యున్నత చదువులు చదివే విధంగా పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా చర్యలు చేపట్టారని తెలిపారు.
అదేవిధంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలలోని విద్యార్థుల చదువులకు తోడ్పడిందని తెలిపారు. గ్రామ గ్రామాల్లో సచివాలయాలు నెలకొల్పి ప్రజలకు మెరుగైన సేవలను అందించే విధంగా సచివాలయాలను రూపుదిద్దారని తెలిపారు. అదేవిధంగా రైతులకు మేలు చేకూర్చే విధంగా ప్రతి సచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పంట దిగుబడులు పెంపొందించే విధంగా రైతులకు తోడ్పాటు నిచ్చే దిశగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు చేసినట్టు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులకు ప్రసంస పత్రాలను అందజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News