Home /News /andhra-pradesh /

KURNOOL REAL GABBAR SINGH THIS SI USE HORSE FOR HIS TRAVELLING IN NANDYALA DISTRICT NGS

Real Gabbar Singh: ఈ ఎస్ఐ రియల్ గబ్బర్ సింగ్.. పోలీస్ వాహనం వదిలి.. గుర్రంపై స్టేషన్ కు.. కారణం అదేనా?

రియల్ గబ్బర్ సింగ్

రియల్ గబ్బర్ సింగ్

Real Gabbar Singh: పోలీ ఉన్నతాధికారులు అంటే సాధారణంగా ప్రభుత్వం కేటాయించిన వాహనంలోనే స్టేషన్ కు వెళ్తారు.. కానీ ఈ ఎస్ కాస్త ఢిపరెంట్ గా ఆలోచించారు. వహనాన్ని వదిలీ గుర్రపు సారీ చేసుకుంటూ.. స్టేషన్ కు వెళ్తున్నారు. అలా వెళ్లడానికి కారణం ఏంటి..?

ఇంకా చదవండి ...
    Real Gabbar Singh: గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఖాఖీ డ్రస్ తో పవన్ చూపించే దూకుడుకి విజుల్స్ పడ్డాయి. పోలీస్ (Police) అంటే ఇలా ఉండాలి అంటూ జనం క్లాప్స్ కొట్టారు.. అయితే ఇలాంటివన్నీ సాధ్యం కాని. రియల్ లైఫ్ లో కష్టమే.. కానీ ఆ విషయాలన్ని పక్కన పెడితే.. ఓ ఎస్ ఐ మాత్రం గబ్బర్ సింగ్ స్టైల్లో.. గుర్రపు స్వారీ (Horse Riding) చేస్తున్నారు. ఈ పోలీసు అధికారి మాత్రం చాలా డిఫరెంట్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు సినిమాల్లోనూ మాత్రమే చూసిన సీన్‌ను రియల్ లైఫ్‌లో చేసి చూపిస్తున్నారు. ఎస్ఐ గుర్రపు స్వారీ చూసి.. రియల్ గబ్బర్ సింగ్ అంటూ.. ఇతర పోలీసులు క్లాప్స్ తో స్వాగతం పలుకుతున్నారు. గుర్రంపై ఆయన స్వారీ చేస్తూ వస్తుంటే.. సినిమా హీరో ఉన్నారంటూ పొగడ్తతల్లో ముంచెత్తుతున్నారు.. అలా నిత్యం గుర్రం స్వారీ చేస్తున్న పోలీస్ స్టేషన్ కు వస్తుతన్న ఆ ఎస్ ఐ పేరు.. మారుతీ శంకర్ (Maruti Sankhar). ఆయన గుర్రపు స్వారీ చూసినవారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

    ఈ ఘటన నంద్యాల జిల్లా (Nandyala District)లో రియల్‌గా చోటుచేసుకుంది. నందికొట్కూరు జూపాడుబంగ్లా మండలం తర్తురు జాతరలో విధులు నిర్వహిస్తున్న మారుతీ శంకర్‌.. 10 మంది సీపీవోలు, ముగ్గురు కానిస్టేబుల్స్‌తో గుర్రంపై స్వారీ చేస్తూ కనపడ్డారు. ఎస్ఐ అలా గుర్రంపై కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. నిత్యం ఆయన అలా గర్రంపైనే స్టేషన్ కు వెళ్తుంటారని ఇతర పోలీసులు చెబుతుంటారు. అయితే స్థానికులు ఓ రోజు ఆయన గుర్రపు స్వారీ చూసి ముచ్చటపడి కోరితే.. వారందరి ముందు ఇలా విన్యాసాలు చేస్తూ కనిపించారు.



    ఇదీ చదవండి :సంతాన లేమికి దివ్య ఔషధంలా ఉపయోగపడే ఆకుకు కష్టాలు.. నోటిని పండించే ఈ ఆకు పంటే భారమైందా?

    ఎస్ఐ మారుతీ శంకర్ గుర్రపు స్వారీ చేస్తూ వెళుతుంటే.. వెనుక పోలీస్ వాహనం వారిని ఫాలో అవుతూ వెళ్తుంటుంది. అయితే ఈ సీన్ ను తొలి సారి చూసిన వారు ఎవరైనా ఏదో సినిమా షూటింగ్ జరుగుతుందని డౌట్ పడతారు. కానీ అది వాస్తవం అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయనకు అలా గుర్రం మీ వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది అంటున్నారు ఎస్ఐ. అయితే తాజాగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్ల కారణంగానే ఆయన ఇలా గుర్రం మీద వెళ్తున్నారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే తనకు చిన్నప్పటి నుంచి గుర్రంపై వెళ్లడమంటే.. ఇష్టమని.. అందుకే ఇలా స్వారి చేస్తున్నారని చెబుతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Police, Kurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు