(T. Murali Krishna, News18, Kurnool)
తనకు కారణ్యం మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూకర్నూల్ రాయలసీమ యూనివర్సిటీకి చెందిన బీటెక్ విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టాడు.
అనంతపురం జిల్లా గుత్తి తాలూకా గుంతకల్ మండలం పులగుట్టపల్లి తాండకు చెందిన వి.సురేష్ నాయక్ కర్నూల్ రాయలసీమ యూనివర్సిటీలోని బీటెక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. గత కొంతకాలంగా కొంతమంది విద్యార్థులు తనను మానసిక వేదనకు గురి చేస్తున్నాడని బీటెక్ కళాశాల ప్రిన్సిపల్ హరి ప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేసిన వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపాడు.
ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ చేస్తావా అంటూ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో తన నగ్న ఫోటోలు తీసి ఇబ్బంది పెట్టడంతో ఈ విషయంపై మళ్లీ ప్రిన్సిపల్ హరిప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేస్తే తనను బూతులతో దుర్భాషలాడాడని తెలిపాడు. ఇలా యూనివర్సిటీలో తనకు వరుసగా అవమానాలు జరుగుతుండడంతో జనవరి రెండవ తేదీ యూనివర్సిటీలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డానని బాధితుడి తరుపు మద్దతుదారుడునాయక్ తెలిపాడు.
ఈ విషయంపై తన తల్లిదండ్రులతో కలిసి మరలా యూనివర్సిటీ వీసీ ఆనందరావుకు తెలిపిన ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనపైనే కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి దుర్భాషలాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పి సస్పెండ్ ఆర్డర్ చేశాడని తెలిపారు. దీంతో ఏమి చేయాలో తెలియక చావే ఏకైక మార్గం అని తెలుసుకుని తమ తల్లిదండ్రులతో కలిసి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కర్నూల్ జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించానని తెలిపాడు. కలెక్టర్ ఘటనపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు.
ఎలాగైనా తనకు న్యాయం చేయాలని తనని వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. అలా లేని పక్షంలో తన కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టినట్లు తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News